»   » డోరా..! ఎక్కడికి పోతున్నావ్? నుదుటి పైరక్తం తో భయంకరంగా నయనతార

డోరా..! ఎక్కడికి పోతున్నావ్? నుదుటి పైరక్తం తో భయంకరంగా నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం తెలుగులో హారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. రొమాంచితమైన హారర్ కథాంశాలతో ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేయడమే బాక్సాఫీస్ విజయసూత్రంగా మారిపోయింది. దెయ్యం కథాంశాలకు గ్లామర్ తళుకులను జోడించి సినిమాల్ని రూపొందించే ధోరణి పెరిగిపోయింది. వాణిజ్య పరంగా ఈ చిత్రాలు చక్కటి విజయాల్ని సాధిస్తుండటంతో అగ్రకథానాయికలు సైతం వీటిలో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు.

సమంతా, నయనతార, త్రిష లాంటి స్టార్ హీరోయిన్‌ల ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు కొత్త హారర్ కథలను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన మాయ(తెలుగులో మయూరి) చిత్రంతో భయపెట్టింది నయనతార. హారర్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. ఈ సినిమా విజయం అందించిన స్ఫూర్తితో మరో రెండు హారర్ చిత్రాలకు అంగీకారం తెలిపింది నయనతార. తాజా గా డోరా అంటూ తెరకెక్కుతున్న సినిమా మీద మరింత ఆసక్తినెలకొంది

 డోరా:

డోరా:

మురుగదాస్ రామస్వామి దర్శకత్వం వహిస్తున్న డోరా అనే హారర్ సినిమాలోనూ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఆత్మల నేపథ్యంలోనే తెరకెక్కుతుండటం గమనార్హం.

 గాయమై రక్తం కారుతున్నా:

గాయమై రక్తం కారుతున్నా:

నయనతార మరో హారర్ మూవీ ‘డోరా'. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. రక్తం కారుతూ ఏదో టెన్షన్‌లో నయన కారు డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఈ పోస్టర్ .. సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. నుదుటిపై గాయమై రక్తం కారుతున్నా పట్టించుకోకుండా సీరియస్ గా డ్రైవ్ చేస్తోంది. అనుకున్న గమ్యానికి చేరుకోవాలనే కసి .. పట్టుదల ఆమె కళ్లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ హీరోయిన్‌కు సెకండ్ హారర్ ఫిల్మ్ ఇది.

దాస్ రామస్వామి దర్శకత్వం:

దాస్ రామస్వామి దర్శకత్వం:

గతంలో నయన్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘మాయ' అక్కడ ఘన విజయాన్ని సాధించింది. ‘మయూరి'గా ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అందువలన ‘డోరా' పై భారీ అంచనాలే వున్నాయి. దాస్ రామస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫీమేల్ సెంట్రిక్ రానున్న ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్, తంబి రమియలు నటిస్తున్నారు. ఇక ‘దొర'లోని "ఎనగపొరా" అనే ఆడియో సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్.

 డోరా అంటూ మరోసారి

డోరా అంటూ మరోసారి

ట్యాలెంటెడ్ బ్యూటీ నయనతార.. సినిమాలను సింగిల్ హ్యాండ్ తో లీడ్ చేసే రేంజ్ కి ఎప్పుడో వచ్చేసింది. పెర్ఫామెన్స్ బేస్డ్ సినిమాలు.. గ్లామర్ రోల్స్ తో పాటు.. హారర్ సినిమాలను కూడా చేసేస్తోంది నయన్. గతేడాది ఈ భామ చేసిన 'మాయ'ను హారర్ చిత్రాల ప్రేమికులు అసలు మర్చిపోలేరు. ఇప్పుడో డోరా అంటూ మరోసారి నయన్ మెయిన్ రోల్ లో ఓ సినిమా వస్తోంది.

నయనతారే:

నయనతారే:

డోరా అంటే అర్థం దేవుడిచ్చిన బహుమతి. ఈ మూవీలో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా.. కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ ను యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో చిమ్మచీకటిలో స్పీడ్ గా వస్తున్న ఓ కారుకు నయన్ అడ్డంగా నుంచుని ఉంటుంది. ఈ బ్యూటీని వెనకనుంచి మాత్రమే చూపించినా.. ఆ పోస్టర్ లో కనిపిస్తున్నది నయనతారే అని అర్థమయ్యే జాగ్రత్తలు తీసుకున్నారు.

డోరాను ఫైనల్ చేసింది:

డోరాను ఫైనల్ చేసింది:

ఇక ఇప్పుడు వచ్చీ రెండో లుక్ మాత్రం అసలేదో జరుగుతోంది... అనే ఆసక్తిని పెంచేలా డిజైన్ చేసారు. మొదట ఈ చిత్రానికి టిక్.. టిక్.. టిక్.. అనే టైటిల్ ఫిక్స్ చేస్తారనే టాక్ వచ్చింది కానీ.. చివరకు డోరాను ఫైనల్ చేసింది యూనిట్. దాస్ రామస్వామి డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి సర్కునమ్ నిర్మాత. ఇప్పటికే ఈ డోరా మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. సీనియర్ నటుడు తంబి రామయ్య ఈ హారర్ థ్రిల్లర్ లో నయన్ తండ్రిగా కనిపించనున్నాడు.

హీరో లేకుండానే:

హీరో లేకుండానే:

అదే తరహాలో వారినీ ఆకర్షించేలా నయనతార పాత్ర ఉంటుందని, అంతేకాదు, హీరో లేకుండానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. మర్డర్‌ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే హర్రర్‌ థ్రిల్లర్‌ సబ్జెక్టుతో ‘డోరా రూపొందుతోందని, ఇందులో రొమాన్స్‌కి చోటు లేదని సమాచారం. మొత్తానికి నయన్ మరో సారి అందరినీ భయపెట్టి ఇంకో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేలాగే ఉంది.

English summary
Nayan is playing the titular role in a Movie Named DORA . The first look poster has been released, Nayantara shared the poster on her Twitter handle and wrote,” First Look of #Dora Here it is #DoraFirstLook.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu