హీరో విజయ్ నుంచి పరిహారం కోసం డిమాండ్
చెన్నై : 'సురా'తో వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు చిత్ర హీరో విజయ్ నుంచి పరిహారం ఇప్పించాలని తిరుప్పూరుకు చెందిన ఫసీర్ సోమవారం చెన్నై పోలీసు కమిషనర్ జార్జికి ఫిర్యాదు చేశారు. దానిలోని వివరాల ప్రకారం... 2010లో 'సురా'ను తిరుప్పూరు, ఈరోడ్‌లోని ఏడు థియేటర్లలో ప్రదర్శించేందుకు రూ.21 లక్షలు చెల్లించినట్లు వివరించారు.
చిత్ర పరాజయంతో తనకు రూ. 18.25 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. పరిహారం ఇవ్వాలని హీరోను, నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌ను కోరినా ఫలితం దక్కలేదని తెలిపారు. ఇకనైనా పరిహారం ఇప్పించాలని, లేదంటే చావే శరణ్యమని పేర్కొన్నారు.
ఇక 'తుపాకీ' చిత్రంతో ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకులను కాస్తో కూస్తో మెప్పించగలిగిన తమిళ హీరో విజయ్ తాజాగా అమలాపాల్ తోడుగా ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో 'అన్న' తమిళ అనువాద చిత్రంతో మరోసారి మంచి మార్కులు కొట్టేద్దామని ప్రయత్నించాడు. కానీ సెకండాఫ్ సాగుతూ పోతుండడంతో విజయ్ ఆశ తీరనట్టే అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications












