twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టిక్కెట్ రేటు పెంచవద్దన్నారని, సినిమా ఆపేసారు

    By Srikanya
    |

    చెన్నై: తమిళ స్టార్ విజయ్ కు సమస్యలు ఇప్పుడిప్పుడే తీరేటట్లు లేవు. ఆయన సినిమా రిలీజ్ అంటే ఎక్కడ లేని సమస్యలు ఆయన వెనక పడుతున్నాయి. తాజాగా ఆయన థేరీ చిత్రంతో ముందుకు వస్తున్నారు. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచి చిత్రమైన సమస్యలు వెంటాడుతున్నాయి.

    గత రెండు రోజులుగా.. ఆ సమస్యలు మరీ సంక్లిష్యంగా మారిపోయాయి. తమిళనాడు గవర్నమెంట్... అన్ని ధియోటర్ ఓనర్స్ ని టిక్కెట్ రేటు నామినల్ రేట్లుకే అమ్మాలని, పెంచి అమ్మితే ఊరుకునేది లేదని ఓ రేంజిలో వార్నింగ్ ఇచ్చింది. రేటు పెంచితే జైలు తప్పదన్నట్లు ఆ వార్నింగ్ సారాంశం ఉంది.

    'Theri' Producer threatens Theatre owners and distributors

    అయితే ధియేటర్ ఓవర్లు కంప్లైంట్ ఏమిటీ అంటే... ధేరీ నిర్మాత ..భారీ రేట్లకు ఆ సినిమాకు తమకు అమ్మాడని, తాము తమ పెట్టుబడి వెనక్కి రప్పించుకోవాలంటే మినిమం ఐదు వందలకు తక్కువ అమ్మటానికి లేదని , అంతగా అయితే రిలీజ్ చేయకుండా ఉండటం బెస్ట్ అని అంటున్నారు.

    ముఖ్యంగా కోయంబత్తూరు, చెన్నై, మధురే వంటి ఏరియాల్లో ఈ విషయాన్ని ధియేటర్స్ బయిట నోటీసుగా ఉంచారు. తాము ఈ సినిమాని ప్రదర్శించటం లేదని ధియేటర్ వాళ్లు పోస్టర్లు వేసారు. ఈ విషయమై నిర్మాత ధానుతో మాట్లాడదామంటే మీడియాకు ఆయన దొరకటం లేదు.

    English summary
    In tamilnadu most theatre owners have now complained that, the Producer of the movie has sold them 'Theri' for a huge price by threatening them. So in order to get back investments, they have to sell tickets for more than 500 Rs. And few theater owners decided to stay out by ignoring the release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X