»   » స్టార్ హీరో చేతిలో టాప్ డైరక్టర్ కు అవమానం, కొత్త హీరోలను తయారుచేస్తానంటూ ప్రతిజ్ఞ

స్టార్ హీరో చేతిలో టాప్ డైరక్టర్ కు అవమానం, కొత్త హీరోలను తయారుచేస్తానంటూ ప్రతిజ్ఞ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: వెలుగు ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలో జనం వెంటబడతారు. ఎప్పుడైతే క్రేజ్ తగ్గి, రెండు సినిమాలు ఫ్లాఫ్ అవుతాయో..అందరూ చీడ పురుగులా చూడటం మొదలెడతారు. అప్పుడు ఆ దర్శకుడు లేదా హీరో పరిస్దితి ఎలా ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుంది కదా. ఇప్పుడు అదే పరిస్దితి ఓ టాప్ డైరక్టర్ కు ఎదురైంది.

కొద్ది సంవత్సరాల క్రితం ఆ డైరక్టర్ తో సినిమాలు చేయాలని ప్రతీ స్టార్ హీరో తహతహలాడేవారు. కానీ చాలా మంది టాలెంటెడ్ డైరక్టర్స్ సీన్ లోకి వచ్చేయటం, తనకు ఫ్లాఫ్స్ పలకరించటంతో ఓ టాప్ డైరక్టర్స్ కు ఇండస్ట్రీలో అవమానం ఎదురైందిట.

Top diretor's plan bring new heroes

పెద్ద హీరోల చుట్టూ డేట్స్ కోసం తిరిగిన ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట. ఒకప్పుడు తన చుట్టూ తిరిగిన హీరోలు తనని చిన్న చూపు చూడటం ఆయన ఊహించని పరిణామం. అపాయింట్ మెంట్ కూడా ఇవ్వటానికి హెసిటేట్ చేయటం బాధని కలిగించిందట. కథ వినటానికి కూడా ఇబ్బంది పెట్టారట. ఈ విషయం ఆయన తన స్నేహితులకు చెప్పుకుని బాధపడ్డారట.

దాంతో ఆయన కొత్త హీరోలని, లేదా చిన్న హీరోలను స్టార్స్ చేస్తానని ప్రతిజ్ఞ చేసారట. తను తయారు చేసిన హీరోలతోనే ఈ స్టార్స్ ని ఎదుర్కొని బుద్ది చెప్పాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అందుకోసం ఆయన నిర్మాతలను వెతుకుతున్నారట. ఈ ప్రతిజ్ఞ విని ..మరి స్టార్ హీరోలు కంగారు పడతారున్నారో లేదో మరి. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరో గెస్ చేసారా...

English summary
Mega hit director joined with Telugu prince actor to teach a lesson to Thala and tTalapathi actors who have refused call sheets to the director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu