»   » కష్టం అని తేల్చేసిన త్రిష

కష్టం అని తేల్చేసిన త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాలుగేళ్ల తరవాత నాకు ఎలాంటి పాత్రలు లభిస్తాయి,అప్పుడు ఏ తరహా సినిమాలను చేయాలి లాంటి విషయాల్ని ఈ రోజే గెస్ చేయటం చాలా కష్టం. ప్రేక్షకుల అభిరుచులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. ఈ క్షణంలో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూస్తారో వాటిని ఎంచుకుని ఫాలో అయిపోవటమే బెస్ట్ అని చెబుతోంది త్రిష.మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్రలని పోషించాలని ప్లాన్ చేస్తున్నారు అంటే త్రిష పై విదంగా స్పందించింది.

ఇక రీసెంట్ గా మంగత్తా ఆడియో ఫంక్షన్ లో ఆమె అన్న మాటలు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.అక్కడ ఆమె ఆ సినిమా విజయాన్ని శంకిస్తున్నట్లుగా... 'అభిమానులు తమ హీరోపై ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమా చూడటానికి వస్తారు. తీరా సినిమా వారి అంచనాలకు తగ్గట్టుగా లేకుంటే బాధపడిపోతారు. అందుకే అభిమానులను ముందే హెచ్చరిస్తున్నా... మీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకుంటే ఫీలవ్వకండి. ఓపెన్ మైండ్‌తో సినిమాను చూడండి. సినిమాను ఎంజాయ్ చేయండి'అంది.ప్రస్తుతం వెంకటేష్‌ సరసన నటిస్తోంది. తమిళంలో మాత్రం రెండు చిత్రాలున్నాయి.

English summary
Mankatha is an upcoming Tamil action thriller film written and directed by Venkat Prabhu. It will feature Ajith Kumar in the lead role, starring in his 50th film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu