»   » త్రిషది మూమూలు తెలివి కాదు

త్రిషది మూమూలు తెలివి కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : కెరీర్ లో కదలిక లేనప్పుడు ఏం చేయాలి...త్రిషని అడిగి తెలుసుకోవాలి. ఆమెకు తన క్రేజ్ పోకుండా ఎటు నుంచి ఎటు అడుగులు వేయాలా పూర్తిగా తెలుసు. ప్రస్తుతం తన కెరీర్ లో స్ధబ్దత వచ్చింది. యంగ్ స్టార్ హీరోలకు తను సెట్ కాదని తీసుకోవటం లేదు. వెంకటేష్, బాలకృష్ణ, అజిత్ వంటి సీనియర్ హీరోల నుంచే ఆఫర్స్ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె సంచలనం సృష్టిస్తున్న యంగ్ హీరోల ప్రక్కన చేస్తూ, అటు బాలయ్య వంటి హీరోలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆ ఆఫర్స్ పట్టటం కోసం ఆమె స్టేట్ మెంట్స్ ఇచ్చి వారిని మెచ్చుకుంటోంది.

కొత్త సంచలన నటుడితో త్రిష జోడీ కట్టనుందా.. అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. పదేళ్లపైగా హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటించనుంది. ఆమె గత కొంత కాలం క్రితం మాట్లాడుతూ.. కోలీవుడ్‌ కొత్త స్టార్లు విజయ్‌సేతుపతి, శివకార్తికేయన్‌ ఎదుగుదల తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, వారికి జంటగా నటించేదుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొంది.

Trisha to act with Vijay Sethupathi?

ప్రస్తుతం ఆమె ఆశ నెరవేరేలా కనిపిస్తోంది. విజయ్‌ సేతుపతికి 'సూదుకవ్వుం' వంటి ఘనవిజయాన్ని అందించిన నలన్‌ కుమారస్వామి మరోసారి ఆయనతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో హీరోయిన్‌ కోసం పలువురి పేర్లను పరిశీలించిన దర్శకుడి చూపు త్రిష వైపు మళ్లిందట. దీనికి విజయ్‌ సేతుపతి సిఫారసు కూడా తోడవ్వటంతో ఆమెను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

గతకొంతకాలంగా ఎన్నికల హడావుడిలో ఉన్న నందమూరి బాలకృష్ణ త్వరలో ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.ఈ సినిమాను వచ్చే నెల 2న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారు. రుద్రపాటి రమణారావు నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇందులో బాలకృష్ణ సరసన త్రిషను ఎంపిక చేశారు.

''బాలకృష్ణ నుంచి రాబోతున్న మరో పవర్‌ఫుల్‌ చిత్రమిది. దర్శకుడు మంచి కథను సిద్ధం చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి'' అంటున్నారు నిర్మాతలు. తొలుత ఈ పాత్రలో అంజలిని అనుకున్నా తర్వాత నిర్ణయం మారింది. సత్యదేవ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా జూన్‌ 10న సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

English summary
Kollywood media buzz is that Trisha will be paired opposite to Vijay Sethupathi in his upcoming film with Soodhu Kavvum director Kumaraswamy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu