»   » ష్...త్రిష భయపెడుతోంది (ఫొటోలు)

ష్...త్రిష భయపెడుతోంది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: త్రిష తన కొత్త చిత్రం 'నాయకి'లో విభిన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి క్రేజ్ వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

లవ్‌ యూ బంగారంతో పరిశ్రమకు పరిచయమైన దర్శకులు గోవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

త్రిష ప్రధాన పాత్రలో హారర్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘నాయకి'. తమిళ్‌తోపాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్టు తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఖచ్చితంగా ప్రేక్షకులను భయపెడతానని అంటోంది గ్లామర్ భామ త్రిష.


సౌతిండియాలో స్టార్ హీరోయిన్ రేంజి వరకు వెళ్లి ఓ వెలుగు వెలిగిన త్రిష....గత పదేళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన హవా కొనాగిస్తోంది. కొత్త హీరోయిన్లు ఎంత మంది వచ్చినా, ఎంత పోటీ ఉన్నా త్రిష మాత్రం తనకు తగిన పాత్రలు ఎంచుకుంటూ నిలదొక్కుకుంటూనే ఉంది.


నాయకి చిత్రంలోని త్రిష పోస్టర్స్....

రక్తం మరకలుతో...

రక్తం మరకలుతో...


ట్విట్టర్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో చేతిలో రక్తం మరకలతో కత్తి పట్టుకుని కనిపించింది త్రిష.

మరో పోస్టర్

మరో పోస్టర్

తాజాగా విడుదల చేసిన మరో పోస్టర్‌లో త్రిశూలం పట్టుకుని చెవిలో బ్లూటూత్‌తో మరింత విభిన్నంగా కనిపించి ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను పెంచారు.

బరువు తగ్గింది

బరువు తగ్గింది

హార్రర్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసమే త్రిష ఆరు కిలోల బరువు తగ్గిందట.

రెండు విభిన్నమైన

రెండు విభిన్నమైన

నాయకి సినిమాలో త్రిష రెండు విభిన్నమైన పాత్రలు పోషించబోతోందట.

అవేమిటంటే...

అవేమిటంటే...

అందులో ఒకటి కాలేజీ అమ్మాయి పాత్ర కాగా మరొకటి మిడిల్ ఏజ్ యువతి పాత్ర.

మొదట లావు పెరిగి..

మొదట లావు పెరిగి..

మొదట కాలేజ్ యువతి పాత్రలో కాస్త వయసు తక్కువగా కన్పించడం కోసం.. ఇంతలా బరువుతగ్గుతోందట త్రిష.

రెండో పాత్ర కోసం..

రెండో పాత్ర కోసం..

కాలేజ్ క్యారక్టర్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక.. తిరిగి మరో పాత్ర కోసం బరువు పెరగింది.

హీరోయిన్ ఓరియెంటెడ్

హీరోయిన్ ఓరియెంటెడ్

ఈ పోస్టర్స్ చూస్తూంటే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అని అర్దమవుతోంది

సీజన్

సీజన్

ప్రస్తుతం హర్రర్ కామెడీల సీజన్ నడుస్తోంది. అందులో భాగంగానే ఈ చిత్రం చేస్తున్నారు.

కమల్ తో

కమల్ తో

త్రిష ప్రస్తుతం కమల్ తో చీకటి రాజ్యం చిత్రం చేస్తోంది.

English summary
The first look posters of Trisha's new horror movie, Nayaki, are out. Directed by Govi, Nayaki will have Ganesh Venkatraman of Abhiyum Nanum fame playing the male lead while Jayaprakash, Manobala, Kovai Sarala and Bramanandham will also be seen in pivotal roles.
Please Wait while comments are loading...