»   » హాట్ స్టార్ త్రిష ఇంట్లో సీసీ కెమెరాలు...

హాట్ స్టార్ త్రిష ఇంట్లో సీసీ కెమెరాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కెరీర్ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్న త్రిష రీసెంట్ గా తన భద్రత విషయంలోనూ కేర్ తీసుకుంటోంది. తన ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించుకుంది. అలాగే తాజాగా 'వాయిస్‌ లేజర్‌' కూడా అరర్చికున్నట్లు సమాచారం. ఈ 'వాయిస్‌ లేజర్‌' లు పెట్టడం వల్ల ఎవరు పడితే వాళ్ళు త్రిష ఇంట్లో ప్రవేశించలేరు. ఎవరైనా సరే త్రిష ఇంట్లోకి చేరాలంటే త్రిష కానీ వాళ్ల అమ్మ కానీ మాట్లాడాల్సిందే. వాళ్ల గొంతు వినిపించగానే ఇంటి తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఇక త్రిష ఇంటికి వెళ్లినవాళ్లు ఈ కొత్త సిస్టమ్‌ ని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోతున్నారు. అలాగే తన స్నేహితులను కూడా ఈ సిస్టమ్‌ పెట్టించుకోమని త్రిష సలహా ఇస్తున్నారట. ప్రస్తుతం త్రిష తన గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా మీటా అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ సరసన కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ బుక్కయిందని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu