»   » స్వైన్ ఫ్లూ భయంతో త్రిష ఇలా ... (ఫొటో)

స్వైన్ ఫ్లూ భయంతో త్రిష ఇలా ... (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : స్వైన్ ప్లూ చాలా డేంజర్ గా పాకుతున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలుతీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ కు రీసెంట్ గా స్వైన్ ఫ్లూ ఎటాక్ కావటంతో అందరూపలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సెట్స్ మీద. అందులో బాగంగా త్రిష ఇదిగో ఇలా ముందు జాగ్రత్తగా వాక్సిన్ తీసుకుంది. ఇక్కడ చూసేది ఆ ఫొటోనే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినిమాల విషయానికి వస్తే...

'లేసా లేసా' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి త్రిష. తమిళంలో కమల్‌హాసన్‌, విజయ్‌, అజిత్‌, విక్రం, సూర్యతోపాటు పలువురు అగ్రహీరోలతో ఆడిపాడిందీ అమ్మడు. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వంటి పెద్ద హీరోలతోనే కాదు.. కుర్ర హీరోల సరసన కూడా చిందులేసింది. తాజాగా బాలకృష్ణతో ఓ చిత్రంలో నటిస్తోంది.

Trisha Vaccinated For Swine Flu

ముందు సినిమా తరువాతే పెళ్లి అంటున్నారు చిరునవ్వుల చిన్నది నటి త్రిష. ఈమెలో ప్రత్యేకత ఏమిటంటే సినిమాకు పరిచయం అయినప్పడు నవనవలాడుతూ ఎంత అందంగా ఉన్నారో నేటికీ మాయని అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. నటిగా దశాబ్ద కాలం దాటినా నేటికీ హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిల పరచుకుంటున్నారు. త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబుకు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు.

ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే తెలుగు చిత్రంలో నటించారు. అదే విధంగా శింబు సరసన ఇప్పటికే విన్నై తాండి వరువాయో చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజమే.

Trisha Vaccinated For Swine Flu

త్రిష కు చెప్పుకోతగ్గ పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. అయినా ఆమె తన రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదని సమాచారం. బాలకృష్ణ తో చేస్తున్న చిత్రం కోసం ఆమెకు కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని వినిపిస్తోంది. 

English summary
Trisha has got her dose of SwineFlu vaccine today. She was seen getting poked on her left hand and her pain is being felt by her fans now.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu