twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'తుపాకి' చిత్రం వివాదం... హైకోర్టు జడ్జి చూసి నిర్ణయం

    By Srikanya
    |

    చెన్నై: విజయ్‌ నటించిన 'తుపాకి' చిత్రాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఆర్‌.భానుమతి, న్యాయమూర్తి కేకే శశిధరన్‌లతో కూడిన ధర్మాసనం ఆ చిత్ర నిర్మాతను ఆదేశించింది. అఖిల భారత ముస్లిం లీగ్‌ పార్టీ కార్యదర్శి టి.అబ్దుల్‌ రెహ్మాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో భాగంగా ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా ముస్లిం యువత, మిగతా వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రేరేపించేలా ఉందని అబ్దుల్‌ రహ్మాన్‌ పిటిషన్లో తెలిపారు.

    'తుపాకి' సినిమాకు సంబంధించి అనేకమంది ముస్లిం నాయకులు ముఖ్యమంత్రిని కలిశారని, ఆమె ఆదేశాల మేరకు ఆక్షేపణీయమైన ఐదు సన్నివేశాలను నిర్మాతలు తొలగించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్లీడరు ఐఎస్‌.ఇన్బదురై ధర్మాసనానికి తెలిపారు. ఈ తరుణంలో పిటిషనర్‌ తరపు న్యాయవాది శంకరసుబ్బును చిత్రాన్ని వీక్షించారా అని ధర్మాసనం ప్రశ్నించగా ఆయన చూడలేదని సమాధానమిచ్చారు. దీంతో చిత్ర ప్రదర్శనకు 10న ఏర్పాటు చేయాలని ధర్మాసనం నిర్మాత, దర్శకులను ఆదేశించింది.

    విజయ్‌ హీరోగా దీపావళి కానుకగా వచ్చిన చిత్రం 'తుపాకీ'. ఈ చిత్రంలో తమ మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ముస్లిం సంఘం తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఈ నేపధ్యంలో వివాదం ముదరకుండా దర్శక, నిర్మాతలు బహిరంగ క్షమాపణ చెప్పి, అభ్యంతర సన్నివేశాలు తీసి వేయటానికి సిద్దమయ్యారు. మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదలైంది. ఇందులో తమ వారిని తీవ్రవాదులతో పోలుస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సదరు వర్గ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇండియా నేషనల్‌ లీగ్‌ కట్చి ఆధ్వర్యంలో చెన్నై లో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు దర్శక, నిర్మాతలు.. ముస్లిం వర్గ ప్రతినిధులతో మీడియా సమావేశం నిర్వహించారు.

    మురుగదాస్ మాట్లాడుతూ.... "దీపావళికి విడుదలైన మా తుపాకి చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని మా దృష్టికి వచ్చింది. మేము కావాలని చేసిన సీన్స్ కావవి... అయితే నేను వారిని నా సోదరులగా భావిస్తాను. అందుకే వెంటనే వారు ఏవైతే అభ్యంతరకర సన్నివేశాలు చెప్తున్నారో వాటిని తొలిగిస్తున్నాను." అన్నారు.

    English summary
    Controversies around Tupaki seem to be never ending, as the film has now landed in fresh troubles. Chennai High court chief Justice wants to see vijay's Thuppaki film. The Muslims in Chennai have raised their objection against the Vijay starrer film claiming that the movie showcases their community in a bad light and it has hurt their sentiments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X