మరోసారి విశ్వరూపం చూపించనున్న కమల్ హాసన్.. మరింత కొత్తగా..

నటనతో ఎన్నో ప్రయోగాలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటుడు కమల్ హాసన్. కథ నచ్చితే పాత్రతోనే సినిమాకు ప్రాణం పోస్తాడు. ఇక ఈ సీనియర్ హీరో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. ఎలాంటి సినిమా చేసినా కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. నటన విషయంలో ప్రయోగాలు ఎప్పటిలానే కొనసాగుతున్నప్పటికి అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందడం లేదని కమల్ హాసన్ పసిగట్టారు.

ఇక మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లడం వలన కమల్ హాసన్ సినిమాలకి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఇండియన్ 2ను భారీ స్థాయిలో స్టార్ట్ చేశారు గాని ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు కమల్ హాసన్ తన ఫోకస్ మొత్తం విక్రమ్ సినిమాపైనే పెట్టాడు. మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

 two different roles in Kamal hasan upcoming movie vikram

అయితే విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపిస్తారని టాక్ వస్తోంది. రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట. ముందుగా ఫస్ట్ హాఫ్ లో బ్లైండ్ పాత్రలో చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఆ తరువాత సెకండ్ హాఫ్ లో సడన్ గా పోలీస్ ఆఫీసర్ గా దర్శనమిస్తాడట. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు లోకేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాదిలోనే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా కమల్ హాసన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X