»   »  త్రిష షూటింగ్ లో ఇద్దరి దుర్మరణం...

త్రిష షూటింగ్ లో ఇద్దరి దుర్మరణం...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Trisha
త్రిష,ఆర్య జంటగా భిల్లా ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తయారవుతున్న చిత్రం 'సర్వం'. ఈ చిత్రం షూటింగ్ లో అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. చెన్నై లోని జెమినీ ఫ్లై ఓవర్ వద్ద నిర్మాణంలో ఉన్న పదకొండు అంతస్తుల భవనం వద్ద ఇది చోటు చేసుకుంది. ఈ సినిమా కోసం హాస్పటిల్ సెట్ వేస్తున్నారు. ఈ దారుణం యూనిట్ మెంబర్స్ అంతా ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కి ఒకేసారి వెళ్తునప్పుడు జరిగింది. టెంపరరి లిప్ట్ లోకి వారంతా ఎక్కటంతో లోడ్ ఎక్కువై తొమ్మిదివ ఫ్లోర్ లో కూలిపోయింది. స్పాట్ లో క్రింద ఉన్న యూనిట్ మెంబర్ ఉదయ్ కుమార్(25 సంవత్సరాలు)మరణించాడు. మరొకరుని హాస్పటిల్ కి తీసుకెళ్తూండగా మరణించాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X