»   » నా ప్రాణానికి ముప్పు...హాస్య నటుడు వడివేలు

నా ప్రాణానికి ముప్పు...హాస్య నటుడు వడివేలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కో ఆర్టిస్టు సింగముత్తు వల్ల తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని, అందుకే అతన్ని చట్ట ప్రకారం అరెస్టు చేయాలని తమిళ హాస్య నటుడు వడివేలు కోరారు. అది జరిగిన నాడే తనకు ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. తనను మోసం చేయడమే కాకుండా ప్రతిష్టను దిగజార్చాడని వడివేలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం తొమ్మిదవ మెట్రోపాలిటన్‌ మెజి స్ట్రేట్‌ కోర్టులో హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింగముత్తు చేసిన పని తనను మానసిక ఆందోళనకు గురిచేసిందని తెలి పారు. సింగముత్తు గతంలో అనేక మందిని మోసం చేశారని ఆరోపించారు. అతన్ని కోర్టు శిక్షిస్తుందని ఆశిస్తున్నానన్నారు.

దీనికి ముందు వడివేలు తర ఫు న్యాయవాది పాల్‌ కనకరాజ్‌ కోర్టులో పిటిషను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సింగముత్తు ఇటీవల కొన్ని తమిళ పత్రికల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యాఖ్యానాలు చేసినట్లు తెలిపారు. దీనికిగాను తాను దాఖలు చేసిన పరువునష్టం దావాకు ఇంతవరకు సమాధానం రాలేదని పేర్కొన్నారు. సింగముత్తు తనకు ఏడు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చాడని ఆరోపించారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలకు గాను సెక్షన్‌ 499, 500 ప్రకారం అరెస్టు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు వచ్చే నెల మూడవ తేదీకి వాయిదా వేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu