»   » కాలం మహిమ: కమిడియన్ కు జంటగా హీరోయిన్ సదా

కాలం మహిమ: కమిడియన్ కు జంటగా హీరోయిన్ సదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, ఓ తరం కుర్రాళ్ల గుండెలను మెలితిప్పిన సదా స్టార్ హీరోలందరి సరసనా చేసింది. అయితే గత కొద్ది కాలంగా అవకాశాలు లేక పూర్తిగా వెనకబడింది. చాలా మంది కొత్త హీరోయిన్స్ వచ్చేయటంతో ఆమెకు ఆఫర్స్ రావటం లేదు. ఈ నేపధ్యంలో ఆమె ఇప్పుడు ఓ చిత్రంలో కమిడయన్ సరసన కూడా నటించటానికి సిద్దపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చాలా హోమ్లీగా ఉందే.. అంటూ తమిళ,తెలుగు ప్రేక్షకుల వద్ద కితాబు అందుకున్న హీరోయిన్ సదా. 'జయం' చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ తార సరైన చిత్రాలను ఎంచుకోక పోవడంతో ఉనికిని చాటుకోలేకపోయ్యారు. ఆ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో 'అపరిచితుడు‌'లో కనిపించి మంచి మార్కులు కొట్టినా.. రాణించలేకపోయింది.

Vadivelu to romance Sada in 'Eli'

చివరగా 'ఉన్నాలే ఉన్నాలే' హిట్‌తో చిత్ర పరిశ్రమలో కనిపించకుండా పోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వనుంది. 'వైగై పుయల్‌' వడివేలు హీరోగా నటిస్తున్న హాస్య చిత్రం 'ఎలి'లో సదా కీలకపాత్ర పోషించనుంది. ఈ చిత్రంలో వడివేలుతో కలిసి చిందులేయనుంది సదా. విద్యాసాగర్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాకు యువరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

గతంలో వీరిద్దరి కలయికలో 'తెనాలిరామన్‌' వచ్చింది. ఇదిలా ఉండగా ఈ బుధవారం నుంచి వడివేలు, సదాకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. సిటీ సినీ క్రియేషన్స్‌ బ్యానరుపై అమర్‌నాథ్‌, సతీష్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో వడివేలు గూఢచారిగా నటిస్తుండటం విశేషం.

English summary
Now the comedian Vadivelu is again acting as a hero in Tenaliraman director Yuvaraj's new film Eli.The latest news is that the makers have roped in Sada of Anniyan fame as Vadivelu's pair in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu