»   »  చివరకు వడివేలుతో నయనతార...

చివరకు వడివేలుతో నయనతార...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nayantara
తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ గా చెప్పుకుంటున్న న్యూస్ నయనతార...వడివేలుతో డాన్స్ చేస్తోందని. అదీ నయనతార హీరోయిన్ గా చేసిన భిల్లా సినిమాలోని హిట్ సాంగ్ మై నేమ్ ఈజ్ భిళ్ళా రీమిక్స్ లో ... ఇక ఈ విచిత్రం విజయ్ చిత్రం Villu లో చోటు చేసుకుంటోంది. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయనతార ఓ కమిడెయిన్ ప్రక్కన డాన్స్ చేయటానికి ఒప్పుకోవటాన్ని అందరూ ఆశ్చర్యం తో చూస్తున్నారు. అయితే గతంలో తమిళ పోకిరీలో వడివేలు ప్రక్కన అసిన్ తన సూపర్ హిట్ గజనీలో సాంగ్ రీమిక్స్ లో నర్తించింది. అలాగే శ్రియ Indhralogathil Na Azhagappan అనే చిత్రంలో వడివేలుతో డాన్స్ చేసింది. ఇప్పుడు టర్న్ నయనతార వద్దకు వచ్చింది. ఇక ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ అందిస్తున్నాడు. ఇదీ హిట్టయితే తరువాత త్రిష వంటి వారు ఆ లిస్ట్ లో చేరుతారు. ఇక ప్రస్తుతం ఈ రీమిక్స్ సాంగ్ షూటింగ్ ఎ.వి.ఎమ్ స్టూడియో లో నిరవధికంగా జరుగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X