Ramya krishna vs Vanitha Vijay Kumar: శివగామి వార్నింగ్.. పట్టించుకొని బిగ్‌బాస్ కంటెస్టెంట్! షోలో రచ్చ..

తమిళ టెలివిజన్ కార్యక్రమాల్లో టాప్ రేటింగ్ షో బీబీ జోడిగల్ రియాలిటీ షోలో స్టార్ యాక్టర్ రమ్యకృష్ణ, బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి వనితా విజయ్ కుమార్ మధ్య వాడివేడిగా వాదనలు చోటుచేసుకొన్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి అర్ధాంతంరంగా వనితా విజయ్ కుమార్ తప్పుకొన్న సంగతి తెలిసిందే. వనిత పాల్గొన్న చివరి ఎపిసోడ్‌లో జడ్జి రమ్యకృష్ణ, వనిత విజయ్ కుమార్ మధ్య వాదనలకు కారణం ఏమిటి? వనితా విజయ్ కుమార్ ఈ షో నుంచి తప్పుకోవడానికి కారణం ఏమిటంటే..

బీబీ జోడిగల్ షో నుంచి తప్పుకొన్న వనిత

బీబీ జోడిగల్ షో నుంచి తప్పుకొన్న వనిత

వివాదాస్పద సెలబ్రిటీ వనితా విజయ్ కుమార్ బీబీ జోడిగల్ అనే రియాలిటీ షో నిర్వాహకులు, మరికొందరిపై తీవ్ర ఆరోపణలు చేసింది. విజయ్ టీవీ యాజమాన్యం మంచి వారే కానీ.. అందులో పనిచేసే వారు కొందరు తనను టార్గెట్ చేస్తున్నారు. తనను మహిళలనే విషయాన్ని పట్టించుకోకుండా కొందరు మహిళలే తనను వేధించారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత తాను బీబీ జోడిగల్ షో నుంచి తప్పుకొన్నట్టు ప్రకటించడం తమిళ మీడియాలో చర్చనీయాంశమైంది.

 రమ్యకృష్ణతో హీట్ డిస్కషన్

రమ్యకృష్ణతో హీట్ డిస్కషన్

ఇక తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన బీబీ జోడిగల్ ప్రోమోలో రమ్యకృష్ణ, వనితా విజయ్ కుమార్ మధ్య హీట్ డిస్కషన్ జరిగాయి. తాజా ఎపిసోడ్‌లో బీభత్స రసం కాన్సెప్ట్‌తో స్కిట్స్ ప్రదర్శించారు. అయితే కాళికా దేవీ నటించిన వనితా విజయ్ కుమార్ పెర్ఫార్మెన్స్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే రమ్యకృష్ణ వాదనతో ఏకీభవించని వనితా విజయ్ కుమార్ అంతే మొత్తంలో నిరసన వ్యక్తం చేసింది.

కాళికా దేవిగా వనితా విజయ్ కుమార్

కాళికా దేవిగా వనితా విజయ్ కుమార్

కాళికాదేవి అవతారంలో వనితా విజయ్ కుమార్ ప్రదర్శనను చూసిన తర్వాత మరో వ్యక్తితో పోల్చి చూడటం జరిగిందనేది ప్రోమోలో స్పష్టమైంది. అయితే మరొకరితో తనను పోల్చి చూడటం సరికాదు అంటూ వనితా విజయ్ కుమార్ అంటే.. అలా చేయకుండా ఒకరి ఫెర్మారెన్స్‌ను జడ్జ్ చేయడం కుదరదు అంటూ రమ్యకృష్ణ ఘాటుగా స్పందించింది. దాంతో తన ముఖం ముందే ఓ రకంగా అసంతృప్తి వెళ్లగక్కుతూ స్టేజ్ మీద నుంచి వనిత వెళ్లిపోవడంతో రమ్యకృష్ణ ఆగ్రహానికి గురైంది.

బుసలు కొట్టిన రమ్యకృష్ణ

బుసలు కొట్టిన రమ్యకృష్ణ

వనితా విజయ్ కుమార్ స్టేజ్ మీద నుంచి కిందకు వెళ్లిన తర్వాత కూడా రమ్యకృష్ణ తన స్థానంలో కూర్చొని బుసలు కొట్టినట్టు కనిపించింది. తన స్థానానికి తగిన గౌరవం ఇవ్వలేదనే అభిప్రాయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. వనిత విజయ్ కుమార్, రమ్యకృష్ణ మధ్య జరిగిన వాడివేడి వాదనలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజా ప్రోమో వైరల్‌గా

తాజా ప్రోమో వైరల్‌గా

బీబీ జోడిగల్ ప్రోమో రిలీజ్ తర్వాత రమ్యకృష్ణ, వనితా విజయ్ కుమార్ వాదనలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఈ ప్రోమో వైరల్ కావడంతో ఆదివారం ప్రసారమయ్యే ఈ షో ఎపిసోడ్‌పై భారీ అంచనాలు పెరగడం కాకుండా టాప్ రేటింగ్ నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నది. అయితే నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగానే ప్రోమోను క్రియేట్ చేసి బజ్ క్రియేట్ చేశారు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 వనితా విజయ్ కుమార్ సినీ కెరీర్..

వనితా విజయ్ కుమార్ సినీ కెరీర్..


వనిత విజయ్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. 2K అజగనథు కాదల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అంధాదూన్ తమిళ రీమేక్‌లో ప్రశాంత్ కలిసి కనిపిస్తారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టుల్లో వనిత భాగస్వామ్యం అవుతున్నారు.

Recommended Video

Vanitha Vijayakumar, Peter Paul Marriage BREAK UP మూడో మొగుడ్ని కూడా తరిమేసిన వనితా విజయ్‌కుమార్
రమ్యకృష్ణ కెరీర్ టాప్ రేంజ్‌లో

రమ్యకృష్ణ కెరీర్ టాప్ రేంజ్‌లో


ఇక రమ్యకృష్ణ కెరీర్ విషయానికి వస్తే.. టెలివిజన్, సినీ రంగాల్లో పలు ప్రాజెక్టులతో భాగస్వామ్యం అయ్యారు. తెలుగులో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా కూడా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపిస్తారు. తమిళంలో పార్టీ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కన్నడలో శివగామి అనే చిత్రంలో నటిస్తున్నారు. మలయాళంలో ఆమె నటించిన షైలాక్ చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X