»   » మమ్మల్ని రెచ్చగొట్టింది వారే, వరలక్ష్మితో నా బంధం అంత వరకే: విశాల్

మమ్మల్ని రెచ్చగొట్టింది వారే, వరలక్ష్మితో నా బంధం అంత వరకే: విశాల్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తమిళ నటుడు విశాల్ తన స్నేహితురాలు, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మిని ప్రేమిస్తున్నాడని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే శరత్ కుమార్‌తో గొడవల కారణంగానే వీరి వివాహం లేటవుతుందనే వార్తలు సైతం వినిపించాయి. తాజాగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ ఈ విషయమై స్పందించారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు వరలక్ష్మికి తనకు మధ్య ఏమీ లేదన్నారు.

   శరత్ కుమార్‌తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవు

  శరత్ కుమార్‌తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవు

  శరత్ కుమార్‌తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవు. తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు, నడిగర్ సంఘం ఎలక్షన్స్ విషయంలోనే విబేధాలు ఉన్నాయన్నారు. ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ విషయంలో ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చిన మాట నిజమే అన్నారు. మేము ఎలక్షన్లో గెలిచాక ఆ బిల్డింగ్‌పై దృష్టిపెట్టాం. వచ్చే ఏడాది ఫిబ్రవరికి అది పూర్తవుతుందన్నారు.

   తమిళనాడుకే ఒక ఐకానిక్‌లా ఉండేలా కడుతున్నాం

  తమిళనాడుకే ఒక ఐకానిక్‌లా ఉండేలా కడుతున్నాం

  తాము నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలిచిన తర్వాత నడిగర్ సంఘం బిల్డింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాము. తమిళనాడుకు అది ఒక ఐకానిక్ బిల్డింగ్ అవుతుంది. ఎవరైనా చెన్నై వస్తే ఎంజీఆర్ సమాధి, ఆ బీచ్‌ను చూసి మా ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కూడా చూడటానికి రావాలి. తమిళనాడుకే ఒక గొప్ప గుర్తింపు తెచ్చేలా ఐకానిక్‌గా నిలిచేలా బిల్డింగ్ కడుతున్నామని విశాల్ తెలిపారు.

  మమ్మల్ని రెచ్చగొట్టింది వారే

  మమ్మల్ని రెచ్చగొట్టింది వారే

  శరత్ కుమార్‌తో అంతలా విబేధించే మీరు వాళ్ల అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఎలా మెయింటేన్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు విశాల్ స్పందిస్తూ నాకు ఆయనతో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వ్యక్తిగతంగా మా మధ్య ఏమీ లేదు. నడిగర్ సంఘం విషయంలో మేము కొన్ని ప్రశ్నలు లేవనెత్తినపుడు శరత్ కుమార్ వర్గం వారు దమ్ముంటే ఎలక్షన్లో నిలబడండి రా... ఊరికే వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు అని రెచ్చగొట్టడంతో అంతా ఏకమయ్యాం. నేను, కార్తి మాది చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. ఎలక్షన్లో దిగుదామని దిగాం. మేము శరత్ కుమార్ కు వ్యతిరేకం ఏమీ కాదు... అన్నారు.

  వరలక్ష్మితో ఆ విషయాలు పంచుకుంటా

  వరలక్ష్మితో ఆ విషయాలు పంచుకుంటా

  వర లక్ష్మితో ప్రెండ్షిప్ పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి అనే దానిపై విశాల్ స్పందిస్తూ... ఆమె నా బెస్ట్ ఫ్రెండ్, చాలా క్లోజ్. మనకు మిత్రులు దొరకడం చాలా కష్టం, సుఖాలు, సంతోషాలు, కష్టాలు పంచుకునే మంచి ఫ్రెండ్స్ ఉంటే పాజిటివిటీ ఉంటుంది. అలాంటి వారిలో వరలక్ష్మి ఒకరు అని విశాల్ స్పష్టం చేశారు.

  తెలుగు ప్రజలు నాకు ఇచ్చిన భాగ్యం

  తెలుగు ప్రజలు నాకు ఇచ్చిన భాగ్యం

  తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తాననే మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారు? అనే ప్రశ్నకు విశాల్ స్పందిస్తూ....గతంలో తెలుగు ఫిల్మ్ చేస్తానని చెప్పిన మాట నిజమే. అది చేద్దామనుకునే సమయానికి ఏదో ఒక బాధ్యత నాపై పడుతోంది. మూడు సంవత్సరాల్లో మూడు ఎలక్షన్లలో నిలబడ్డాను. అందుకే వీలు కాలేదు. త్వరలోనే వీలు చూసుకుని చేస్తాను అన్నారు. ‘అభిమన్యుడు' పాలకొల్లు నుండి చెన్నైలోని ఆర్కే మల్టీప్లెక్స్ వరకు బాగా ఆడుతుంది అంటే అది నాకు ప్రేక్షకులు ఇచ్చిన భాగ్యం.... అని విశాల్ తెలిపారు.

  English summary
  The latest buzz doing the rounds in Kollywood is that Vishal has found his soul mate in none other than Sarath Kumars daughter, Varalaxmi. But Vishal denied this news. "Varalaxmi is Very Good Friend of Mine" Vishal said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more