»   » వేలైక్కారన్ సెకండ్ లుక్ పోస్టర్ ఔట్

వేలైక్కారన్ సెకండ్ లుక్ పోస్టర్ ఔట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం 'వేలైక్కారన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన రాగా... తాజాగా సెకండ్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌తో పాటు మళయాల నటుడు పహాద్ ఫాజిల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.

పహాద్ ఫాజిల్ పుట్టినరోజును పురస్కరించుకుని 'వేలైక్కారన్' సెకండ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో ఇద్దరూ ఒకరితో ఒకరు ఏ మాత్రం తీసిపోకుండా పోటా పోటీగా నటిస్తారని తెలుస్తోంది. ఆగస్టు 14న ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు.

Velaikkaran Second Look Poster Out

ఈ చిత్రంలో ఇంకా నయనతార, ప్రకాష్ రాజ్, రోహిణి, సతీష్, ఆర్.జె బాలాజీ తదితరులు నటిస్తున్నారు. జయం రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజా ఇంతకు ముందు తమిళ సూపర్ ఫిల్మ్ 'తాని ఒరువన్' చిత్రాన్నికి దర్శకత్వం వహించారు.

ఎంటర్టెన్మెంటుతో పాటు ఒక సోషల్‌మెసేజ్ జోడించి ఈ సినిమా తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. 'వేలైక్కారన్' మూవీపై తమిళనాడులో అంచనాలు భారీగా ఉన్నాయని, సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని తెలిపారు.

English summary
The second look poster of Sivakarthikeyan's upcoming movie Velaikkaran has been released today on the occasion of Fahad Faasil's birthday.If the poster is anything to go by, it seems that Sivakarthikeyan and Fahad Faasil will be playing the two lead roles in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu