»   » తప్పు చేశాననుకుంటే!..: స్నేహకు డైరెక్టర్ క్షమాపణ.., మోసం చేయలేదని..

తప్పు చేశాననుకుంటే!..: స్నేహకు డైరెక్టర్ క్షమాపణ.., మోసం చేయలేదని..

Subscribe to Filmibeat Telugu
మోసం చేయలేదు.. స్నేహకు డైరెక్టర్ క్షమాపణ..

క్రిస్మస్ కానుకగా విడుదలైన తమిళ సినిమా వేలైక్కారన్ మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఇంతలోనే సినిమాపై కొన్ని వివాదాలు ముసురుకోవడం గమనార్హం. సినిమాలో స్నేహ నటించిన సన్నివేశాలకు ఎక్కువగా కత్తెర పెట్టడం ఆమె వైపు నుంచి విమర్శలకు తావిచ్చింది. దీంతో దర్శకుడు వివరణ ఇచ్చుకోక తప్పలేదు..

అంత మాటా?: కోలీవుడ్ ఫ్యూజులు అవుట్.., ఆ డైరెక్టర్ కామెంట్స్ విన్నారా!..

స్నేహా ఆరోపణలు:

స్నేహా ఆరోపణలు:

వేలైక్కారన్ సినిమాలో నటి స్నేహా ఓ కీలక పాత్ర పోషించారు. ఇందుకు గాను 18రోజులు కాల్షీట్స్ ఇచ్చారు. ఇంత చేస్తే.. సినిమాలో నా పాత్ర 15నిమిషాల కన్నా తక్కువ నిడివికే పరిమితమైందని స్నేహా ఆరోపించారు.

 క్షమాపణ చెప్పిన మోహన్ రాజా:

క్షమాపణ చెప్పిన మోహన్ రాజా:

స్నేహా ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో దర్శకుడు వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ముందుగా స్నేహకు క్షమాపణ చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. సినిమాలో ఆమె సన్నివేశాలను ట్రిమ్ చేయడానికి దారి తీసిన కారణాలను వివరించారు.

 అందరం బాధపడ్డామని..:

అందరం బాధపడ్డామని..:

సినిమాలో స్నేహ సన్నివేశాలు తగ్గించడంపై తనతో పాటు అందరూ బాధపడ్డారని మోహన్ రాజా అన్నారు. అయితే స్నేహతో పాటు మరికొంతమంది నటీనటుల సన్నివేశాలు కూడా తొలగించాల్సి వచ్చిందని చెప్పారు.

 మోసం చేయాలనుకోలేదు..:

మోసం చేయాలనుకోలేదు..:

ఎవరినీ మోసం చేయాలన్న ఉద్దేశంతో సన్నివేశాలు తొలగించలేదని మోహన్ రాజా తెలిపారు. కథ ప్రకారం స్నేహ 90 రోజులు నటించినట్లు సినిమాలో కనిపిస్తుందని, అందుకోసం పలు రకాల కాస్ట్యూమ్స్‌తో సన్నివేశాలు చిత్రీకరించాల్సి వచ్చిందన్నారు.

 స్నేహతో ఎక్కువ రోజులు షూట్:

స్నేహతో ఎక్కువ రోజులు షూట్:

స్నేహ నటించిన సీన్స్ చాలా కీలకం కావడంతో ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో వైవిధ్యం చూపించాల్సి రావడంతో.. ఎక్కువ రోజులు స్నేహతో షూట్ చేయాల్సి వచ్చిందన్నారు.

 ఏదేమైనా.. క్షమించండి:

ఏదేమైనా.. క్షమించండి:

సినిమాలో స్నేహ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా, ప్రస్తుతం ఆమె పాత్రకే మంచి స్పందన లభిస్తోందన్నారు మోహన్ రాజా. ఏదేమైనప్పటికీ తాము తప్పు చేసినట్లు స్నేహ భావిస్తే క్షమించమని కోరుతున్నానంటూ మోహన్‌రాజా పేర్కొన్నారు.

English summary
Velaikkaran director Mohan Raja said sorry to actress Sneha, she alleged that After all the pain I went through for Velaikkaran, I feel disappointed with director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X