»   » ఫ్యాన్స్ మోసం: హీరో తో ఫొటో దిగాలంటే రెండు వేలు

ఫ్యాన్స్ మోసం: హీరో తో ఫొటో దిగాలంటే రెండు వేలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: అభిమాన హీరోతో ఫొటో దిగాలంటే ఎవరికైనా ఆసక్తే. దీన్ని కొందరు క్యాష్ చేసుకోవటానికి ప్రయత్నించి దొరికిపోయారు. విజయ్ కి తమిళనాడులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు లక్షలు ఇచ్చైనా ఆయనతో ఫొటో దిగాలి...తమ కలెక్షన్ లో పెట్టుకోవాలని అనుకునేవాళ్లు బోలెడు. ఈ విషయాన్ని గమనించిన కొందరు విజయ్ ఫ్యాన్స్ ...మోసానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమిళ స్టార్ హీరో విజయ్... తమిళనాడులోని అన్ని జిల్లాలకు వెళ్లి అభిమానులను కలిసి, వారితో ఫొటో దిగే పోగ్రామ్ పెట్టుకున్నారు. అందుకు ఓ తేదీని ఎనౌన్స్ చేయటం వారిని కలవటం చేస్తున్నారు. అయితే సేలం జిల్లాకు ఆయన ఇంకా వెళ్లలేదు. ఆయన తన చిత్రాల బిజీలో పడిపోయారు. దాంతో అభిమానులు ఇప్పుడు..వస్తాడు..అప్పుడు వస్తాడు అని ఎదురుచూస్తున్నారు.

అభిమానులు ఎదురుచూపులుని కొందరు ఫ్యాన్స్ ...క్యాష్ చేసుకోవాలనుకుని ఫిక్స్ అయ్యారు. దాంతో వెయ్యి నుంచి రెండు వేలు దాకా సేలం లోని ఫ్యాన్స్ అశోశియోషన్ కు చెందిన వారు వసూలు చేయటం మొదలెట్టారు. విజయ్ తో ఫొటో దిగాలంటే ముందుగా డబ్బు కట్టి నమోదు చేసుకోవాలని చెప్పారు. దాంతో అభిమానులంతా ఎగబడి డబ్బు కట్టడం మొదలెట్టారు.

ఆ డబ్బు తీసుకుని హీరో గారు ఇక్కడికి రాగానే ఫొటో దిగే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేసారు. కానీ ఈ విషయం ఈ లోగా పోలీసులకు చేరింది. వారు వెంటనే దాడి చేసి వారిని పట్టుకున్నారు.

Vijay

ఇక విజయ్ తాజా చిత్రం పులి విశేషాలకు వస్తే...

'కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజరు లేటెస్ట్‌గా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న 'పులి'. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవలే రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం టీజర్‌ యూట్యూబ్‌లో ఒక్కరోజులోనే 20 లక్షల హిట్స్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సందర్భంగా నిర్మాతలు శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ మాట్లాడుతూ ''మా 'పులి' చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఒక్కరోజులోనే 20 లక్షల హిట్స్‌ సాధించి కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

 Vijay fans collected money from Public to take pics with Vijay!!

పి.కె. చిత్రాన్ని మించిన స్థాయిలో ఈ చిత్రం టీజర్‌కి హిట్స్‌ రావడం ఆనందంగా వుంది. ఈ టీజర్‌ని చూసి విజరు తమకు అందించిన బర్త్‌డే గిఫ్ట్‌గా ఫీల్‌ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీదేవిగారు రాణీ సౌమ్యాదేవి క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా నటించారు. 'పులి' చిత్రం విజరు కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

తమిళంలో ఎన్నో చిత్రాలకు బాణీలు అందించిన దేవిశ్రీ ఈ చిత్రం విడుదలకాకముందే ప్రశంసలు అందుకుంటున్నారు. డిఫరెంట్ కథాంశంతో ఫాంటసీ నేపథ్యంలో రూపుదిద్దుతున్న ఈ చిత్రంలోని పాటలు విని నిర్మాతలు దేవిశ్రీప్రసాద్‌ను అభినందించారు. ఆయనకు బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించారట.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ- విజయ్‌తో సినిమా అంటేనే చాలా హైప్‌లో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ‘పులి' అనే పేరును ప్రకటించగానే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను కంపోజ్ చేశాను. అందులో ఒక పాట చిత్రీకరణ పూర్తయింది. మరోపాట సాగుతోంది. మూడోపాట రికార్డింగ్ దశలో ఉంది.

 Vijay fans collected money from Public to take pics with Vijay!!

విజయ్‌ని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపేలా ఈ చిత్రం ఉంటుంది. ఫాంటసీ చిత్రమైనా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్‌కాకుండా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ సంవత్సరంలో ఓ అద్భుతాన్ని సృష్టిస్తోంది. నేను కూడా ఈ చిత్రం విడుదలకోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.

శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ బేనర్‌పై శింబు దేవన్‌ దర్శకత్వంలో శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రోలో కనిపించనుంది. ప్రముఖ నటి శ్రీదేవి దక్షిణాదిన పునరాగమనం చేస్తున్న చిత్రర 'పులి'. చింబు దేవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శింబు, శ్రుతి హాసన్‌, హన్సిక, సుదీప్‌ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట.

షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

English summary
Some of Vijay fans in Salem district have cheating public by collecting money from public for take pics with Vijay during his Salem visit.
Please Wait while comments are loading...