»   » ఆడియో పంక్షన్ లో పొరపాటు , బహిరంగ క్షమాపణ చెప్పాడు

ఆడియో పంక్షన్ లో పొరపాటు , బహిరంగ క్షమాపణ చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ సూపర్ స్టార్ విజయ్ చాలా గౌరవంగా మెలుగుతూంటారు. ఏ విషయంలో అయినా చిన్న పొరపాటు జరిగినా వెంటనే క్షమాపణ చెప్పి ఆ పొరపాటుని దిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అందనుకే ఆయనంటే అభిమానులకు అంత గౌరవం.

తాజాగా ఆయన ఎవరూ ఊహించని విధంగా బహిరంగంగా క్షమాపణ కోరి అందరి మనస్సులను మరోసారి గెలుచుకున్నారు. రీసెంట్ గా ఆయన తాజా చిత్రం ధేరీ ఆడియో పంక్షన్ జరిగింది. ఈ పంక్షన్ లో ఆయన ఓ సంఘటన గురించి చెప్తూ చైనా కమ్యూనిస్ట్ లీడర్ మావో ని రష్యన్ లీడర్ గా ప్రస్తావించారు.

ధేరీ ట్రైలర్ ఇక్కడ చూడండి

Vijay issues unconditional apology

ఈ పొరపాటుని అక్కడి డైలీలు పాయింట్ అవుట్ చేసాయి. ఇది అక్కడ మీడియాలో హైలెట్ అయ్యింది. దాంతో ఈ పొరపాటు..వివాదంగా మారకుండా అవ్వాలని వెంటనే రియాక్ట్ అయ్యాడు. అలాంటి పెద్ద పంక్షన్స్ జరిగినప్పుడు ఇలాంటి చిన్న పొరపాట్లు జరుగుతుంటాయని, పెద్ద మనస్సుతో వాటిని క్షమించెయ్యాలని,తాను ఉదహరించన సంఘటనలోని అర్దాన్ని మాత్రమే తీసుకోవాలని అని ఆయన అన్నారు. అదీ సంగతి .

తమిళ సూపర్ స్టార్ విజయ్-సమంత జంటగా "రాజా రాణి" ఫేం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "తేరీ " ఆడియో మార్చి 20న విడుదల అయ్యింది.ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు.

Vijay issues unconditional apology

విజయ్ పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా మరో రెండు ముఖ్యపాత్రల్లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. విజయ్ మునుపటి చిత్రం "పులి " దారుణంగా విఫలమై ఉండడంతో.. ఆయన అభిమానులు "తేరీ "పై చాలా ఆశలు పెట్టుకొన్నారు!

విజయ్‌ సరసన సమంత, అమీ జాక్సన్‌లు ఆడిపాడనున్నారు. వి క్రియేషన్స్‌ బ్యానర్‌పై కలైపులి ఎస్‌.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూర్చారు.

English summary
After leading dailies point out the mistake committed by him, Vijay pointed out that such mistakes are bound to happen in big events and also apologized for the fault he committed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu