పోస్టర్ కాపీకొట్టిన స్టార్ డైరక్టర్

By Srikanya

పరభాషా చిత్ర కథలను కొద్దిగా మార్చి కాపీ కొట్టి హిట్టు కొట్టడం అనేది ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే.అయితే రీసెంట్ గా పోస్టర్స్ ను కూడా దర్శక,నిర్మాతలు వదిలేటట్లు కనపడటం లేదు.ఘర్షణ, ఏమి మాయ చేసావే చిత్రాలతో తెలుగువారికి సుపరిచయమైన దర్శకుడు గౌతమ్ మీనన్.ఆయన తాజాగా యోహాన్ ...అధ్యాయం ఒండ్రు అనే చిత్రం ప్రారంభించారు.విజయ్ హీరోగా తమిళంలో ప్రారంభమవుతన్న ఈ చిత్రం పోస్టర్ రీసెంట్ గా విడుదల చేసారు.అయితే ఈ చిత్రం పోస్టర్ హాలీవుడ్ చిత్రం లార్జో వించ్ అనే చిత్రంకి కాపీ అని ప్రచారం మొదలైంది.ఏఆర్ రహమాన్ సంగతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ ఫస్ట్ మిసన్ ఇన్ న్యూయార్క్.దీన్ని బట్టి ఇది ఓ పోలీస్ స్టోరీ అని తమిళ మీడియా అంటోంది.ఇక ఈచిత్రంలో నటించే హీరోయిన్,మిగతా క్రూ ఎవరనేది ఇంకా విడదల చేయలేదు.హీరో విజయ్ ఓ క్రైమ్ ని సాల్వ్ చేయటానికి న్యూ యార్క్ కి వెళ్లటం అక్కడ ఎదురయ్యే సమస్యల సమాహారమే చిత్రం అని చెప్తున్నారు.ఇక ఇప్పటికే ఈ చిత్రానికి మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది.వరస పరాజయాల్లో విజయ్ ఈ చిత్రంతో అయినా హిట్ కొడతానని భావిస్తున్నాడు.సూర్యతో గౌతమ్ మీనన్ రూపొందించిన కాక కాక్క రేంజిలో సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా నడుస్తుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X