Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 1 hr ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 2 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- News
దేశంలో నిరాటంకంగా ఎన్నికలు- త్వరలో రాజస్ధాన్, గుజరాత్లో- ఏపీలోనే విచిత్ర పరిస్ధితి
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Sports
ఇదంతా ఓ కలలా ఉంది.. చాలా ఒత్తిడికి గురయ్యా: నటరాజన్
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భద్రత కల్పించమంటూ ప్రభుత్వానికి హీరో విజయ్ వినతి
విజయ్ హీరోగా దీపావళి కానుకగా వచ్చిన చిత్రం 'తుపాకీ' . ముస్లిం సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదలైంది. ఇందులో తమ వారిని తీవ్రవాదులతో పోలుస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సదరు వర్గ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇండియా నేషనల్ లీగ్ కట్చి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం చెన్నై నీలాంగరైలో ఆందోళన చేపట్టారు.
హీరో విజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కపాలీశ్వరన్ వీధిలోని ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రంగప్రవేశం చేసిన పోలీసులు 65 మందిని అరెస్టు చేశారు. నీలాంగరై, వడపళనిలోని విజయ్ ఇళ్లకు నగర పోలీసులు గట్టి భద్రత కల్పించారు. అడయారులోని విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్, విరుగంబాక్కంలోని దర్శకుడు మురుగదాస్ ఇంటికి కూడా భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లను ముట్టడిస్తామని ఇండియా నేషనల్ లీగ్ కట్చి అధ్యక్షుడు జవహర్ అలీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే ఈ చిత్రాన్ని నిషేధించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జవహర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... తక్షణం తుపాకీ సినిమాలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా వున్న డైలాగుల్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముస్లిం వర్గానికి చెందిన అన్ని పార్టీలు, సంస్థల్ని కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముస్లింలను తీవ్రవాదులుగా, సంఘవిద్రోహశక్తులకు చిత్రీకరించడం ఎంతవరకు సబబని, మంచీచెడు అన్ని మతాల్లో, అన్ని వర్గాల్లో వుందని పేర్కొన్నారు. ఇదిలా వుండగా తుపాకీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద కూడా పోలీసులు భారీ భద్రతను కల్పించారు. అలాగే ముస్లింల పేరు గల వారిని తీవ్రవాదులుగా చిత్రీకరించడం దారుణమని పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.