»   » హీరో 60వ చిత్రం...రంగం సిద్దం

హీరో 60వ చిత్రం...రంగం సిద్దం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : విజయ్‌ తన భారీ ఫ్లాఫ్ చిత్రం ‘పులి' తర్వాత దాన్ని మరిపించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ కోసం వరస ప్రాజెక్టులు రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రమే కాక...తర్వాత మరో చిత్రం కూడా కమిటయ్యాడు. అది విజయ్ ...60 వ చిత్రం కావటం విశేషం.

‘పులి' తర్వాత రాజు- రాణి.. డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం తెరి. ఈ సినిమాను ఏ మాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా జోరుగా పూర్తి చేశాడు అట్లీ. విజయ్‌ కూడా ఇతర చిత్రాలకు ఇచ్చిన విధంగా గ్యాప్‌ ఇవ్వకుండా వేగంగా ‘తెరి'ని పూర్తి చేశాడు. ‘పులి' విడుదలకు ముందే ‘తెరి' షూటింగ్‌ సగభాగం పూర్తయింది.

Vijay's 60th film will be directed by Bharathan!

అదే స్పీడు కొనసాగడంతో ఇప్పుడు ‘తెరి' చిత్రం షూటింగ్‌ పార్ట్‌ ముగిసింది. దీంతో కొంత గ్యాప్‌ తీసుకుని విజయ్‌ కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ స్థితిలో విజయ్‌ 60వ చిత్రం గురించి ముఖ్యమైన విషయం వెల్లడైంది. ఈ చిత్రం డైరెక్టర్‌ భరతన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్ర కథను విజయ్‌ వినడం, ఓకే చెప్పడం వంటివి పూర్తయినప్పటికీ విజయ్‌ చెప్పినట్టు కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. దీంతో భరతన్‌ ఆ పనిలో నిమగ్నమయ్యాడు. ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం ఎంపిక పనులు జోరుగా సాగుతున్నాయి. వీటిని రెండు నెలల్లో పూర్తి చేసి ఏప్రిల్‌ తొలి వారంలోనే విజయ్‌ 60వ సినిమా షూటింగ్‌ పనులు ప్రారంభిస్తామని భరతన్‌ చెబుతున్నాడు.

English summary
Vijay's 60th film will be helmed by none other than director Bharathan. He was the one who wrote dialogues for Vijay’s blockbuster film Ghilli and also directed Vijay’s first ever double action film Azhagiya Tamil Magan.
Please Wait while comments are loading...