»   »  తేల్చారు: డిజాస్టర్ టాక్ ...ఏడున్నర కోట్లు లాస్

తేల్చారు: డిజాస్టర్ టాక్ ...ఏడున్నర కోట్లు లాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : విజయ్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం పులి భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే టాక్ కు భిన్నంగా మొదటి వారంలో కలెక్షన్స్ రావటంతో కొంతలో కొంత ఒడ్డున పడింది. కేవలం ఈ చిత్రం ఏడున్నర కోట్లు లాస్ తో బయిటపడిందని చెన్నై ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం ఫెయిల్యూర్ కి కారణం ఓవర్ బడ్జెట్ అని అంటున్నారు. లేకపోతే సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కు లాభాలు రాకపోయినా రికవరీ అయ్యేదని చెప్పుకుంటున్నారు.

రీసెంట్ గా తేల్చిన లెక్కలు ప్రకారం డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ ఏడున్నర కోట్లు వచ్చింది. అయితే ఈ మొత్తాన్ని తన తదుపరి చిత్రంలో రికవరీ చేస్తానని విజయ్ ని కలిసిన డిస్ట్రిబ్యూటర్స్ కు హామీ ఇచ్చారు. విజయ్ తదుపరి చిత్రం దర్శకుడు అట్లీతో ఉంది. ఈ చిత్రం పంపిణీ హక్కులలో ఈ లాస్ ని రికవరీ చేస్తానని మాట ఇవ్వటంతో వారు ఆనందపడుతున్నట్లు సమాచారం.

Vijay's Puli came disaster for Distributors with 7.5 Cr loss

తెలుగు రాష్ట్రాలతో పాటు, హిందీలో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాక తొలి రోజు పలు షోలు రద్దయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ‘పులి' సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వస్తాయని వేసిన అంచనాలు తలక్రిందులు అయ్యాయి. దాదాపు సగానికి పైగా కలెక్షన్స్ పడిపోయాయి.

శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్ కె టి స్టూడియోస్ బ్యానర్‌పై శింబు తమీన్స్, పి టి సెల్వకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న పులి చిత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో చిత్రాని ఎస్ వి ఆర్ మీడియా బ్యానర్‌పై సి జె శోభ విడుదల చేసారు.

English summary
Recent reports say Vijay' Puli distributes affected with around 7.5 Cr loss on the film ,Last day distributes meet Vijay at home and he promised them that "we should makeover this loss through upcoming with Atlee " .
Please Wait while comments are loading...