»   » బాహుబలితో పోటీ పడుతుందా? ‘పులి’ సెన్సార్ రిపోర్ట్

బాహుబలితో పోటీ పడుతుందా? ‘పులి’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ‘పులి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కాబోతోంది. అక్టోబర్ 1న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి' రేంజిలో ఉంటుందని అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ‘పులి' సినిమా డిఫరెంటుగా ఉంటుందని అంటున్నారు.

పిల్లలను, పెద్దలను, అభిమానులను అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు. మరో వైపు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

Vijay's Puli censor report

శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్ కె టి స్టూడియోస్ బ్యానర్‌పై శింబు తమీన్స్, పి టి సెల్వకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న పులి చిత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో చిత్రాని ఎస్ వి ఆర్ మీడియా బ్యానర్‌పై సి జె శోభ విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీదేవి కూడా నటిస్తున్నారు. సినిమాలో ఆమె కీలకమైన పాత్రలో మహారాణిగా కనిపించబోతున్నారు. విజయ్‌ సరసన శృతి హాసన్‌, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.

English summary
Puli which went for Censor Board of Film Certification got clean U certificate.
Please Wait while comments are loading...