For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కస్సుమన్న హన్సిక : 'బాహుబలి' తో మాకు పోలికేంటి

  By Srikanya
  |

  చెన్నై: చింబుదేవన్‌ దర్శకత్వంలో విజయ్‌, శ్రుతిహాసన్‌, శ్రీదేవి, హన్సిక, సుదీప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పులి'. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. హిందీలోనూ డబ్బింగ్‌ అవుతోంది. అక్టోబర్ 1న విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఓ రేంజిలో చేస్తున్నారు. ఈ నేఫద్యంలో ఈ చిత్రాన్ని రాజమౌళి తాజా సూపర్ హిట్ చిత్రం 'బాహుబలి' తో పోలుస్తున్నారు. రీసెంట్ గా మీడియావారు ఆమెను ఈ విషయమై ప్రశ్నించారు. అయితే ఇది హన్సికకు నచ్చినట్లు లేదు.

  Hansika

  'బాహుబలి' కన్నా బెటర్ గా ఉంటుందా అని ఆమెను అడిగితే...హన్సిక మాట్లాడుతూ..., "పులి సినిమా పూర్తిగా ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడినది. ఎన్నో ఎన్నెన్నో మాయలు, మంత్రాలు,తంత్రాలుతో నిండింది. కానీ బాహుబలి పూర్తిగా యుద్దానికి సంభందించిన చిత్రం. ఈ రెండింటికి పోలిక పెట్టడం పద్దతి కాదు ". అంది. కొద్ది రోజుల క్రితం దర్శకుడు శింబు దేవన్ సైతం ఇలాంటి అభిప్రాయమే వెల్లబుచ్చాడు.

  తమిళ స్టార్ హీరో విజయ్‌ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కించిన చిత్రం 'పులి'. ఈ చిత్రంలోని 'పులి.. పులి..' అనే పాట ప్రోమోను విడుదల చేసినట్లు సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. ఆ వీడియోని ఇక్కడ చూడండి.

  ఈ చిత్రానికి టాలీవుడ్‌ రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. ఇటీవల ఈ చిత్రం తెలుగు వర్షన్‌ ఆడియా విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో విజయ్‌, శ్రుతిహాసన్‌ జంటగా ఓ పాటను ఆలపించారు.

  ఈ చిత్రానికి చింబు దేవన్‌ దర్శకత్వం వహించారు. విజయ్‌తోపాటు శ్రీదేవి, శ్రుతి హాసన్‌, హన్సిక, సుదీప్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 'పులి' ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ‘కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్‌ లేటెస్ట్‌గా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న ‘పులి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటోంది.

  puli
  ఈ సందర్భంగా నిర్మాతలు శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ మాట్లాడుతూ ‘‘ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీదేవిగారు రాణీ సౌమ్యాదేవి క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా నటించారు. ‘పులి' చిత్రం విజయ్‌ కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

  శోభారాణి మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌ నుంచి వస్తున్న భారీ ఫాంటసీ సినిమా ఇది. విజయ్‌ సూపర్‌హీరోలా కనిపిస్తారు. శ్రీదేవి పాత్ర సినిమాకు కీలకం. డిఎ్‌సపి సంగీతం ఆకట్టుకుంటుంది. భారీ బడ్టెట్‌తో హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సీజీ వర్క్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తుపాకీ సినిమా తర్వాత విజయ్‌ పట్టుబట్టి ఈ సినిమా హక్కుల్ని మాకు ఇప్పించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు చక్కని స్పందన వస్తోంది. '' అని తెలిపారు.

  విజయ్‌, శృతి హాసన్‌, హన్సిక, ఆలిండియా స్టార్‌ శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ బేనర్‌పై శింబు దేవన్‌ దర్శకత్వంలో శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు.

  English summary
  Hansika says, "Puli is a film that has full of fantasy elements. Glowing flowers, witch craft, wizards and many magics. But Baahubali is a pure war film. So comparisons would be unfair".
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X