»   » 'పులి' : శ్రీదేవి బాగా అప్ సెట్ ...అన్యాయం అని నిలదీశింది

'పులి' : శ్రీదేవి బాగా అప్ సెట్ ...అన్యాయం అని నిలదీశింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : అతిలోక సుందరిగా భారత సినీ పరిశ్రమను తన అంద చెందాలతో ఆకట్టుకున్న శ్రీదేవి తన తాజా చిత్రం 'పులి' టీమ్ చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం. రీసెంట్ గా దర్శకుడు శింబు దేవన్...ఆమెకు డబ్బింగ్ చెప్పటానికి ఆర్టిస్టుని వెతకమనటం జరిగింది. అయితే టీమ్ ఎఫెర్ట్ ని చూసి శ్రీదేవే స్వయంగా డబ్బింగ్ చెప్పటానికి వచ్చింది. అయితే అక్కడే ట్విస్టు పడింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

డబ్బింగ్ చెప్పుతున్నప్పుడు తన పోర్షన్ చూసుకున్నప్పుడు ఆమెకు చాలా బాధ కలిగిందని సమాచారం. దానికి కారణం తన పాత్రను చాలా కుదించేసారని, ఎడిటింగ్ లేపేసారని తెలుస్తోంది. రెండు రోజులు లోపే ఆమె డబ్బింగ్ పూర్తైపోయింది. దాంతో ఆమె చాలా నిరాశ చెందిందని, ఎవరితో కూడా చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయిందని అంటున్నారు.

తర్వాత ఆమె నిర్మాత,దర్శకులను పిలిపించి తన కాల్ షీట్స్ చాలా రోజులు పాటు తీసుకున్నారు కదా..అలాంటిది తెరపై తాను చాలా తక్కువ సేపు ఉండటమేంటని అడిగినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ లో తప్పనిసరి పరిస్ధితుల్లో లెంగ్త్ కోసం కట్ చేయాల్సి వచ్చిందని దర్శకుడు చెప్పినా ఆమె వినలేదని అంటున్నారు.

మిగతా కథనం...స్లైడ్ షోలో...

నెగిటివ్ పాత్రలో...

నెగిటివ్ పాత్రలో...

రాణిగా ఓ ప్రాంతాన్ని శాసిస్తున్న శ్రీదేవి... తన అహంకారంతో ప్రజలను నానా అవస్థలపాలు చేయగా... కథానాయకుడు విజయ్‌ ఎలా అడ్డుకుని.. గద్దెనెక్కారన్నదే చిత్ర కథ అన్నట్లు కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

చాలా గ్యాప్‌ తర్వాత ...

చాలా గ్యాప్‌ తర్వాత ...

ప్రస్తుతం తమిళంలో 'పులి' చిత్రంలో కీలకపాత్ర పోషించారు. విజయ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె రాణిగా నటించారు. హన్సిక, శ్రుతిహాసన్‌, సుదీప్‌ తదితరులు నటించారు.

తెలుగులోనూ....

తెలుగులోనూ....

ఇదే పేరిట విడుదలవుతోంది. తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో తెలుగులోనూ ఆమె డబ్బింగ్ చెప్తోందని సమాచారం.

కోటి అడిగింది

కోటి అడిగింది


తెలుగు డబ్బింగ్ నిమిత్తం ఆమె కోటి రూపాయలు వసూలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

తెలుగు ఆడియో లాంచ్

తెలుగు ఆడియో లాంచ్

తెలుగులో పులి ఆడియో లాంచ్ సెప్టెంబర్ 17న భారీగా జరగనుంది.

హిందీలోనూ

హిందీలోనూ

ఈ చిత్రం హిందీలోనూ విడుదల అవుతోంది. సెప్టెంబర్ 25న హిందీ ఆడియో లాంచ్

20 సంవత్సరాల తర్వాత..

20 సంవత్సరాల తర్వాత..

ఇదిలా ఉండగా నటి శ్రీదేవి దాదాపు 20 ఏళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్న సినిమా కావడం విశేషం.

25 సంవత్సరాల తర్వాత

25 సంవత్సరాల తర్వాత

ఈ సినిమాకు ఆమే స్వయాన డబ్బింగ్‌ చెప్పారు. గతంలో తన చివరి సినిమాల్లోనే డబ్బింగ్‌ చెప్పడం మానుకున్నారు శ్రీదేవి. అయితే ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత మళ్లీ గళమెత్తారు. ఇందుకోసం ఆమె చెన్నైలోనే కొన్ని రోజుల పాటు బస చేశారు.

తెలుగు రైట్స్ కు

తెలుగు రైట్స్ కు

ఇక 'పులి' చిత్రంతో శ్రీదేవి చాలా కాలం తర్వాత తెలుగులోకి వస్తోంది. తెలుగు వెర్షన్ రైట్స్ ని శోభారాణి 12 కోట్లుకు తీసుకున్నారు.

లేటువటంతో...

లేటువటంతో...

సీజీ గ్రాఫిక్స్ లేటవటంతో అక్టోబర్ 1 కు ఈ విడుదల తేదీని ముందుకు తోసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

ఇళయ దళపతి విజయ్ మాట్లాడుతూ....

ఇళయ దళపతి విజయ్ మాట్లాడుతూ....

'నాకు చాల రోజులుగా తీరని కోరిక తీరింది. ఒక హిస్టరికల్ బేస్‌డ్ చిత్రంలో నటించాలి. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ మిస్ కాకుండా ఉండాలని కోరిక ఉండేది. ఈ పులి చిత్రంతో ఆ కోరిక తీరిపోయింది. దర్శకుడు చింబుదేవన్ చేసిన కొత్త ప్రయత్నమే ఈ చిత్రం అన్నారు.

శ్రీదేవి మాట్లాడుతూ....

శ్రీదేవి మాట్లాడుతూ....

తమిళ్‌నాడు నాకు ఎప్పుడు నాకు అమ్మగారిల్లే ఎప్పటికీ మరిచిపోను. చాల ఎళ్లు తరువాత తమిళంలో నేను చేస్తున్న చిత్రం ఇది. విజయ్ ఒక ప్రొఫెషనల్ హీరో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హీరో. మంచి టీమ్ వర్క్ తో చేశాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ అన్నారు.

దర్శకుడు చింబుదేవన్ మాట్లాడుతూ....

దర్శకుడు చింబుదేవన్ మాట్లాడుతూ....

విజయ్ కథ వినగానే ఇది అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది. తప్పకుండా మనం కలసి చిత్రం చేస్తున్నాం అన్నారు. అప్పటి నుండి నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకు పోయారు. లవ్,యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో సరికొత్త విజయ్ కనిపిస్తారు అన్నారు.

నిర్మాతలు శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ మాట్లాడుతూ....

నిర్మాతలు శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ మాట్లాడుతూ....

‘‘ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీదేవిగారు రాణీ సౌమ్యాదేవి క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా నటించారు. ‘పులి' చిత్రం విజయ్‌ కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

ఎవరెవరు...

ఎవరెవరు...

విజయ్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ బేనర్‌పై శింబు దేవన్‌ దర్శకత్వంలో శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు.

English summary
According to the latest report, Sridevi is quite upset after noticing that she has played a restrained role in the high budget flick Puli as she was able to wrap up her dubbing in less than two days time.
Please Wait while comments are loading...