twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్‌కు తమిళ సర్కార్‌కు షాక్.. మరో వివాదంలో ‘సర్కార్‌’

    |

    Recommended Video

    Sarkar Movie Controversy : Kadambur Raju Comments On Sarkar Movie

    ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన సర్కార్ మూవీకి ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రాజకీయ వివాదంలో చిక్కుకున్నది. గతంలో విజయ్ నటించిన మెర్సల్ చిత్రంపై బీజేపీ దాడి చేస్తే.. ఈ సారి అధికార ఏఐడీఎంకే ప్రభుత్వం నుంచి హెచ్చరికలు రావడం గమనార్హం. సర్కార్ చిత్రం విడుదలైన రోజే తమిళనాడుకు చెందిన మంత్రి సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదంగా మారింది. ఇంతకీ తమిళ మంత్రి చేసిన హెచ్చరికలు ఏమిటంటే..

    సర్కార్ తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్సర్కార్ తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    అధికార పార్టీ అభ్యంతరం

    అధికార పార్టీ అభ్యంతరం

    సర్కార్ చిత్రంలో ఎన్నికల హామీకి లోబడి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన వస్తువులను మంటల్లో కాల్చే సన్నివేశం ఒకటి ఉంది. దానిపై మంత్రి కాదంబర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టేలా ఉంది అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

    ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా

    ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా

    మంత్రి కాదంబర్ రాజు మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వాన్ని కించపరిచేలా కొన్ని సన్నిశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని గృహోపకరణాలను ప్రజలు మంటల్లో పడేసే సన్నివేశాలు తప్పుడు రీతిలో చిత్రీకరించారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేసినట్టు ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.

    సర్కార్ చిత్రంలో భారీగా

    సర్కార్ చిత్రంలో భారీగా

    ఓటు ప్రాధాన్యాన్ని చెప్పే అంశంతో తెరకెక్కిన సర్కార్ చిత్రంలో భారీగా ప్రభుత్వ వ్యతిరేక సన్నివేశాలు ఉన్నాయి. పదునైన డైలాగ్స్‌తో విజయ్ ప్రభుత్వాల తీరును ధ్వజమెత్తారు. దాంతో రాజకీయ నేతల నుంచి ప్రతికూల స్పందన వ్యక్తమవుతున్నది.

    మెర్సల్ చిత్రంలో

    మెర్సల్ చిత్రంలో

    గతేడాది దీపావళీకి విడుదలైన మెర్సల్ (అదిరింది) చిత్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను విజయ్ తన సినిమా ద్వారా ఎండగట్టాడు. జీఎస్టీ పన్ను చట్టాన్ని సినిమాలో తూర్పారా పట్టారు. దాంతో అప్పట్లో మెర్సల్ చిత్రాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

    కార్పోరేట్ సీఈవోగా, ఎన్నారైగా

    కార్పోరేట్ సీఈవోగా, ఎన్నారైగా

    కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన సర్కార్ చిత్రంలో విజయ్ కార్పోరెట్ కంపెనీ సీఈవోగా ఎన్నారై పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించారు. సినిమాపై సినీ విమర్శకులు పెదవి విరిచినా విజయ్ స్టామినాను రుజువు చేస్తూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతున్నది.

    English summary
    Vijay's Sarkar has opened to average to positive reviews from the critics and audience. The lack of freshness in the storyline has not gone well with a section of the audience. In this occassion, A minister in the Tamil Nadu government has raised objection over a dialogue in Vijay's Sarkar who now wants it to be removed from the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X