For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విధ్వంసం సృష్టించాడు.. రాంచరణ్ రికార్డుకే ఎసరు పెట్టేశాడు!

  |
  Vijay’s Sarkar Overtakes Ramcharan's Rangasthalam Records | Filmibeat Telugu

  ఇళయ దళపతి విజయ్ స్థాయి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. విజయ్ నటించిన చిత్రాలన్నీ వరుసగా ఘనవిజయం సాధిస్తున్నాయి. విజయ్ ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. విజయ్ వరుసగా సందేశాత్మక చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తుపాకీ చిత్రంలో సైనికుల ప్రాధాన్యతని, కత్తి చిత్రంలో రైతు సమస్యలని చూపించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అట్లీ దర్శత్వంలో నటించిన మెర్సల్ చిత్రం ఇండియా మొత్తం ప్రకంపనలు సృష్టించింది. వైద్య విధానం, ఇతర సమస్యల గురించి నేరుగా కేంద్ర ప్రభుత్వంపైనే సెటైర్లు సంధించారు. మెర్సల్ చిత్రం విజయ్ కెరీర్ లోనే తిరుగులేని హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సర్కార్ గా వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు.

  డివైడ్ టాక్‌తో ప్రారంభమై

  డివైడ్ టాక్‌తో ప్రారంభమై

  తొలి షో నుంచే సర్కార్ చిత్రానికి ఫిలిం క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ మొదలైంది. ఈ చిత్రం ఆడడం కష్టం అని అంతా అనుకుంటున్న దశలో పుంజుకుని వసూళ్ల విధ్వంసం సృష్టిస్తోంది. విజయ్ స్టామినాకు ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. ఒక రకంగా ఈ చిత్రం చుట్టూ అలుముకున్న వివాదాలు కూడా బాగానే కలసి వచ్చాయి.

  రంగస్థలం రికార్డు బ్రేక్

  రంగస్థలం రికార్డు బ్రేక్

  తాజాగా సర్కార్ చిత్రం గ్రాస్ పరంగా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అంతే కాదు 2018లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సౌత్ ఇండియన్ చిత్రంగా సర్కార్ అవతరించింది. ఈ ఏడాది సమ్మర్ లో విడుదలైన మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్రం 215 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ రికార్డుని అధికమిస్తూ విజయ్ సర్కార్ చిత్రం 217 కోట్ల గ్రాస్ రాబట్టింది.

  మెర్సల్ తరువాత మళ్ళీ

  మెర్సల్ తరువాత మళ్ళీ

  బాహుబలిని మినహాయిస్తే ఇప్పటివరకు సౌత్ లో రజనీకాంత్ రోబో, కబాలి చిత్రాలు.. విజయ్ మెర్సల్, రామ్ చరణ్ రంగస్థలం చిత్రాలు 200 కోట్ల క్లబ్ లో ఉన్నాయి. సర్కార్ చిత్రంతో విజయ్ రెండవసారి ఆ మార్క్ అందుకున్నాడు. అదేవిధంగా దీపికా పదుకొనె పద్మావత్, రణబీర్ కపూర్ సంజు లాంటి చిత్రాల తరువాత 200 కోట్ల క్లబ్ లో చేరిన ఏడవ ఇండియన్ చిత్రంగా సర్కార్ అవతరించింది.

  సన్ పిక్చర్స్ నిర్మాణంలో

  సన్ పిక్చర్స్ నిర్మాణంలో

  భారీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మాణంలో విజయ్, మురుగదాస్ హ్యాట్రిక్ మూవీ రూపిందింది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలో పెద్ద హై డ్రామానే కొనసాగింది. ఈ చిత్రంలో అన్నా డీఎంకే పార్టీ, జయలలిత ప్రతిష్ట దిగజార్చేలా వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ సన్నివేశాలని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.

  ట్విట్టర్ రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీనువైట్లకు హిట్ పడ్డట్లేనా!

   కోమలవల్లిగా వరలక్ష్మి

  కోమలవల్లిగా వరలక్ష్మి

  వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో కోమలవల్లిగా నటించింది. అది జయలలిత అసలు పేరు అంటూ కొందరు వివాదం సృష్టించారు. ఇక విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో దొంగఓట్ల అంశాన్ని ప్రస్తావించిన మురుగదాస్.. మరుగున పడిపోయిన 49పి అనే సెక్షన్ యొక్క ప్రాముఖ్యతని వెలుగులోకి తీసుకుని వచ్చాడు.

  English summary
  Vijay’s Sarkar is the highest grossing south Indian film of 2018. Overtakes Gold, Raazi, Rangasthalam
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X