twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళనాట 'అన్న' రిలీజ్ లేదు... ఎందుకు? (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    చెన్నై : తమిళ చిత్రం 'తలైవా' తెలుగులో 'అన్న'గా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. విజయ్‌, అమలాపాల్‌ జంటగా నటించారు. తమిళనాట మాత్రం ఈ చిత్రానికి కష్టాలు ఎదురయ్యాయి. తెలుగు, తమిళంలో దాదాపు రెండు వేలకు పైగా థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. తెలుగులో 300కుపైగా థియేటర్లలో విడుదలైంది. తమిళంలో మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు.

    అయితే దీనికి కారణం అక్కడి థియేటర్లకు బాంబు బెదిరింపు లేఖలు, ఫోన్‌కాల్స్‌ రావడమే. 'తమిళనాడు ఒదుక్కపట్ట మానవర్‌ పురట్చిపడై' అనే సంఘం నుంచి చెన్నైలోని ఐనాక్స్‌ థియేటర్‌కు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. సినిమాను విడుదల చేస్తే థియేటర్‌లో బాంబులు పేలుతాయని అదే రోజు చెన్నైలోని మరో తొమ్మిది థియేటర్లకూ, వేలూరు, కోయంబత్తూరు, సేలం ప్రాంతాల్లోని థియేటర్లకు కూడా బెదిరింపు కాల్స్‌, లేఖలు వచ్చాయి. దీంతో విడుదల ఆగిపోయింది.

    అయితే ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మాత్రమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన సిట్యువేషన్ ఏర్పడింది. గతంలో విశ్వరూపం మాదిరిగానే ఈ చిత్రం రిలీజ్ కూడా పెద్ద తలనొప్పిగా మారేటట్లు ఉందని అంటున్నారు. దాంతో చిత్రం కొనుక్కున్న వాళ్లు ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకుంటున్నారు.

    మిగతా కథనం..స్లైడ్ షోలో...

    అభిమాని ఆత్మహత్య

    అభిమాని ఆత్మహత్య

    ఈ సినిమా విడుదల కాకపోవడంతో నిరాశకు గురైన అభిమానులు థియేటర్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. సినిమా విడుదల కాలేదనే బాధతో కోవైకి చెందిన విష్ణుకుమార్‌ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విజయ్‌ సంతాపాన్ని ప్రకటించారు.

    రిస్క్ తీసుకోలేం...

    రిస్క్ తీసుకోలేం...

    అంతా సెట్ అవుతోంది రిలీజ్ చేద్దామనుకుంటే... రెండురోజుల కిందట మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చినట్టు చెన్నై థియేటర్‌ యజమానుల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్‌ తెలిపారు. ఎవరూ రిస్క్ తీసుకోవటానికి సిద్దం లేమని వారు తెగేసి చెప్పారు.

    మార్కెట్‌లోకి పైరసీ సీడీలు

    మార్కెట్‌లోకి పైరసీ సీడీలు

    'తలైవా' తమిళ వెర్షన్‌ కెనడా, మలేషియా, సింగపూర్‌తో పాటు రాష్ట్రంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో విడుదల కావడంతో పైరసీ సీడీలు దర్శనమిస్తున్నాయి. విజయ్‌ అభిమానులు సేలంలో వాటిని గుర్తించి ధ్వంసం చేసి నిందితుల్ని పోలీసులకు పట్టించారు. మరో ప్రక్క ఇక్కడ తెలుగు నుంచి కూడా పైరసీ మొదలైంది.

    ఆన్ లైన్ తలనొప్పి...

    ఆన్ లైన్ తలనొప్పి...

    టోరెంట్స్, డౌన్ లోడ్స్ తో ఈచిత్రం తెలుగు, తమిళ వెర్షన్స్ నెట్ లో దొరికేయటంతో ఆసక్తి ఉన్న వారు ఈ చిత్రాన్ని చూసేస్తున్నారు. దాంతో రిలీజైనా పెద్ద ఉపయోగం ఉండదంటూ వినిపిస్తోంది. సినిమా రిలీజయ్యాక ఎలాగో తప్పని ఈ పైరసీ తలనొప్పి..రిలీజ్ కు ముందే ఉండటం విజయ్ ఫ్యాన్స్ ని కలిచివేస్తోంది.

     ప్లాప్ టాక్...

    ప్లాప్ టాక్...

    ఇప్పటికే రిలీజైన చోట్ల ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చేసింది. తెలుగులో డిజాస్టర్ చిత్రంగా దీన్ని ట్రేడ్ వర్గాలు నిర్దారించాయి. ఈ నేపధ్యంలో ఈ టాక్ నెట్ ద్వారా తమిళనాట స్ప్రెడ్ అయ్యి ..రిలీజ్ టైమ్ కు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు.

     తుపాకీ టైమ్ లోనూ...

    తుపాకీ టైమ్ లోనూ...

    విజయ్ గత చిత్రం తుపాకి టైమ్ లోనూ చాలా వివాదాలు చెలరేగాయి. ముస్లింల నుంచి...వివాదం ఎదుర్కొంది. అయితే హీరో విజయ్, ఆయన తండ్రి, దర్శకుడు మురగదాస్ వచ్చి వివరణ ఇచ్చి శాంతింప చేసారు. దాంతో అప్పటికి ఆ గొడవ సర్దుమణిగింది. కానీ ఈ చిత్రం వివాదం ఎప్పటకి ముగుస్తుందో తెలియటం లేదు.

    హీరోలు అండ...

    హీరోలు అండ...

    ఈ చిత్రం విడుదల ఆగిపోవటంతో మిగతా హీరోలు ముందుకు వచ్చి స్పందించాలనుకున్నా...ఉపయోగం లేకుండా పోయింది. పొలిటికల్ తలనొప్పులు ఎదుర్కోవాలని ఎవరికి వారే భయపడుతున్నారు. అప్పటికీ ధనుష్ ముందుకు వచ్చి స్టేట్ మెంట్ ఇచ్చారు కానీ...వెంటనే పొలిటిల్ ప్రెజర్స్ తో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

    తెలుగులో ...

    తెలుగులో ...

    రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో అనిశ్చితి పరిస్దితి ఉండటంతో తెలుగు స్ట్రైయిట్ పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్ ని మార్చుకుని వెనక్కి వెళ్లాయి. దాంతో తమిళ ‘తలైవా' డబ్బింగ్ తో విజయ్ ...‘అన్న' గా ధియోటర్లలోకి ఉత్సాహంగా దిగింది. సరైన పోటీ లేకపోవటంతో అంతా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ తో అదరకొడుతుందనుకుని ట్రేడ్ లో అంచనాలు వేసారు. అయితే విజయ్ కు పెద్దగా ఇక్కడ మార్కెట్ లేకపోవటం,పబ్లిసిటీ సరిగా చేయకపోవటంతో ఓపినింగ్స్ సైతం తెచ్చుకోలేకపోయింది. పోనీ సినిమా బాగుంటే మౌత్ టాక్ తో ముందుకు వెళ్తుందనుకుంటే బ్యాడ్ స్క్రీన్ ప్లే సినిమాను బోర్ గా మార్చేసింది. దాతో ఇక్కడా ప్లాప్ టాక్ వచ్చేసింది.

    లీగల్ సమస్యలూ...

    లీగల్ సమస్యలూ...

    చెన్నై సిటీ సివిల్ కోర్టు దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపింది. తమిళనాడులోని తిరువనెళ్లి జిల్లాకు చెందిన ఎస్‌కెఆర్ కర్ణన్ ‘తలైవా' సినిమాకు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేసాడు. ముంబైలో ఉంటున్న తమిళ కమ్యూనిటీ లీడర్లను సినిమాలో అభ్యంతర కరంగా చూపించారని తన పిటీషన్లో పేర్కొన్నారు. దీంతో స్పందించిన కోర్టు ఆగస్టు 14లోగా వివరణ ఇవ్వాలని దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేసిది.

    జయ జోక్యంతో..:

    జయ జోక్యంతో..:

    తమిళ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఈ విషయంలో జోక్యం చేసుకుంటే త్వరలోనే ఈ సినిమా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని హీరో విజయ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటివరకూ చర్చలు అయితే మొదలు కాలేదు. సినిమా ఎప్పటికి రిలీజ్ అవుతుందో ఎవరు చెప్పలేక పోతున్నారు.

    English summary
    In spite of facing the hurdle for its release in Tamil Nadu, Thalaivaa which was released in other states and overseas is looting the Box Office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X