చెన్నై : విజయ్ హీరోగా దీపావళి కానుకగా వచ్చిన చిత్రం 'తుపాకీ' . ఈ చిత్రంలో తమ మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ముస్లిం సంఘం తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఈ నేపధ్యంలో వివాదం ముదరకుండా దర్శక,నిర్మాతలు బహిరంగ క్షమాపణ చెప్పి, అభ్యంతర సన్నివేశాలు తీసి వేయటానికి సిద్దమయ్యారు. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదలైంది. ఇందులో తమ వారిని తీవ్రవాదులతో పోలుస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సదరు వర్గ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇండియా నేషనల్ లీగ్ కట్చి ఆధ్వర్యంలో చెన్నై లో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు దర్శక,నిర్మాతలు ..ముస్లిం వర్గ ప్రతినిధులతో ఓ మీడియా సమావేశం నిర్వహించారు.
మురుగదాస్ మాట్లాడుతూ...." దీపావళికి విడుదలైన మా తుపాకి చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని మా దృష్టికి వచ్చింది. మేము కావాలని చేసిన సీన్స్ కావవి... అయితే నేను వారిని నా సోదరులగా భావిస్తాను. అందుకే వెంటనే వారు ఏవైతే అభ్యంతరకర సన్నివేశాలు చెప్తున్నారో వాటిని తొలిగిస్తున్నాను." అన్నారు. నిర్మాత కలైపులి ధాను ..బహిరంగ క్షమాపణ తెలియచేసారు. అయితే ఏ సీన్స్ తొలిగిస్తాము అనేది మాత్రం ఈ సమావేశంలో తెలియచేయలేదు. వర్గ ప్రతినిధులతో చర్చించి,ఒకటి రెండు రోజుల్లో ఆ సీన్స్ కట్ చేస్తామని తెలియచేసారు.
ఈ విషయమై చిత్రం హీరో విజయ్ తండ్రి చంద్రశేఖరన్ మాట్లాడుతూ..." మేము ముస్లింల మనోభావాలు దెబ్బతీయాలని,వారి సెంటిమెంట్స్ ని కించపరచాలని చేయలేదు. నా కొడుకు విజయ్ మీ అందరికీ బిడ్డలాంటివాడు. మేం అన్ని మతాలను గౌరవిస్తాము. అంతేకాదు నా కుమారుడు తన తదుపరి చిత్రంలో ముస్లింగా నటించేలా చేస్తాను." అన్నారు.
ముస్లిం సంఘాల ప్రతినిధి మహ్మధ్ హనీఫా మాట్లాడుతూ... "ఆ సీన్స్ వెంటనే తొలిగించేలా చేస్తాము. అలాగే మేము సిని దర్శక,నిర్మాతలను కోరేదేమిటంటే..ముస్లింలను నెగిటివ్ గా చూపెట్టే సీన్స్ మీ చిత్రాలలో పెట్టదు. అలాగే నటీనటులు అలాంటి ఆఫర్స్ వస్తే తిరస్కరించండి." అన్నారు.
Director A.R. Murugadoss and producer Kalaipuli S. Thanu offered a public apology to the members of the community on Thursday and promised to delete certain scenes. Murugadoss said, “Thupakki, which released on Deepavali, is running successfully. However, we got to know from representatives of some organisations that some scenes in the movie hurt the sentiments of Muslims. I wish to assure all that we had no intention of hurting their sentiments. I believe strongly in the fact that they are our brothers. We have agreed to delete scenes to which they raised objections.”