»   » అర్థరాత్రి అనామకుడిలా.... స్టార్ హీరో అయిఉండికూడా ఇలా బీచ్ లో

అర్థరాత్రి అనామకుడిలా.... స్టార్ హీరో అయిఉండికూడా ఇలా బీచ్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

త‌మిళ‌నాడు రాష్ట్రంలో సాంప్ర‌దాయ క్రీడ‌గా జ‌రుపుకునే జ‌ల్లిక‌ట్టును సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పును లెక్కచేయకుండా.. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా జ‌ల్లిక‌ట్టు లో పాల్గొన్న ప‌లువురిని పోలీసులు అరెస్టులు కూడా చేశారు. అయినా కూడా జ‌ల్లిక‌ట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ త‌మిళ‌నాడు రాష్ట్ర‌మంత‌టా నిర‌స‌న జ్వాల‌లు అంతకంతకూ ఉదృత‌మౌతున్నాయి.

తమ సాంప్రదాయ క్రీడ అయిన జ‌ల్లిక‌ట్టును నిర్వ‌హించాలంటూ త‌మిళ‌నాడులోని మెరీనా బీచ్‌లో యువ‌కులు నినాదాలు చేస్తూ నిర‌స‌న తెలుపుతున్నారు. దీనికి మ‌ద్ద‌తుగా కోలీవుడ్ హీరోలు సూర్య‌, విజ‌య్ త‌దిత‌ర స్టార్ హీరోలు ఎవరికి వారు ప్ర‌క‌ట‌న‌లు కూడా విడుద‌ల చేశారు. జ‌ల్లిక‌ట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ప్ర‌ముఖ డాన్స్ మాస్ట‌ర్‌, న‌టుడు, హీరో రాఘ‌వ లారెన్స్ కూడా నిర‌స‌న‌ తెలుపుతోన్న యువ‌కుల‌తో క‌లిసి మెరీనా బీచ్‌లో బైఠాయించారు. అయితే ఇంకోస్టార్ హీరో విజయ్ మాత్రం తాను ఒక హీరోగా నడిగర సంఘం తో కాకుండా మెరీనా బీచ్ లో ఉన్న యువకులతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఒక హీరో గా కాదు. సాధారణ తమిళ పౌరుడు గానే విజయ్ అక్కడ కనిపించాడు

 తమిళ సినీ పరిశ్రమ :

తమిళ సినీ పరిశ్రమ :


జల్లికట్టును బ్యాన్ చేసిన అంశంపై నిరసనలతో హోరెత్తించిన తమిళులకు తోడుగా నిలిచేందుకు తమిళ సినీ పరిశ్రమ మొత్తం ఒక్కతాటి మీద నిలుచోవటమే కాదు.. ఉద్యమకారులకు చేదోడు వాదోడుగా నిలిచారు. పెద్దా.. చిన్నా తేడా లేకుండా అందరూ జల్లికట్టు ఆందోళనలో పాల్గొంన్నారు.

 నిషేధించడం తగదంటూ:

నిషేధించడం తగదంటూ:


తమిళనాడులో జల్లికట్టు రచ్చ జరుతున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు నో చెప్పినప్పటికీ, కొంతమంది నాయకులు, ప్రముఖులు సంప్రదాయ క్రీడ జల్లికట్టుని నిషేధించడం తగదంటూ భహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. హీరో కమల్ హసన్ మాట్లాడుతూ. తమిళుడినైనందుకు గర్విస్తానని,

 జల్లికట్టును ఆడాల్సిందే:

జల్లికట్టును ఆడాల్సిందే:


ఇది తమ సంస్కృతి అని, తనకు జల్లికట్టు అంటే ఎంతో ఇష్టమని, ఒకవేళ జల్లికట్టును నిషేధించాలని అనుకుంటే.. బిర్యానీని కూడా నిషేధించాలని" ఓ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. రజనీ కాంత్ కూడా చేతులు కలిపారు. తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టును ఆడాల్సిందేనని అంటున్నారు రజనీకాంత్.

 తమిళ అగ్రనటులు:

తమిళ అగ్రనటులు:


తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మద్దతుగా వేలాదిమంది యువత జరిపిన ఆందోళనకు మద్దతుగా తమిళ సినీ నటుల సంఘం నడిగర్‌ మౌన నిరసన ప్రదర్శన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిరసన ప్రదర్శనలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తోపాటు పలువురు తమిళ అగ్రనటులు పాల్గొన్నారు.

 విజయ్ ని విమర్షించారు:

విజయ్ ని విమర్షించారు:

అయితే, ఇందులో తమిళ అగ్రహీరో, ఇళయదళపతి విజయ్‌ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఇంతమంది సపోర్ట్ చేస్తున్న ఉధ్యమానికి అంత పెద్ద స్టార్ అయినవిజయ్ రాకపోవటం తో కొందరు చాటుగా, మరికొందరు బాహాటం గానే విజయ్ ని విమర్షించారు. అయితే సలు విషయం తెలిసాక నాలుక్కరుచుకున్నారు.

 ముఖానికి కర్ఛీప్ కట్టుకొని:

ముఖానికి కర్ఛీప్ కట్టుకొని:


జల్లికట్టు నిషేదానికి వ్యతిరేకంగా మెరీనాబీచ్ లో జరుగుతున్న ఆందోళనలో విజయ్ పాల్గొన్నారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. మెరీనాబీచ్ లో యువత ఆందోళనలు మొదలెట్టిన రోజు రాత్రి వేళలోవిజయ్ అక్కడకు వచ్చారని.. ముఖానికి కర్ఛీప్ కట్టుకొని ఆందోళకారుల మధ్యలోకూర్చున్న ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

 రహస్యంగా :

రహస్యంగా :


తన రాకతో హడావుడి అవుతుందన్న ఉద్దేశంతో సాదాసీదాగా వచ్చిన ఆయన రహస్యంగా నిరసనకారులతో కలిసి కూర్చున్న విషయం బయటకు వచ్చింది. ఒక సూపర్ హీరో అయి ఉండి.. అర్థరాత్రి వేళ వేలాది మంది ఆందోళన చేస్తున్న వేళ..వచ్చి అందరితో పాటు తానూ ఒక సాధారణ పౌరుడిగా తన నిరసన తెలిపాడు.

యువత తప్పుబట్టారు;

యువత తప్పుబట్టారు;

తాను పాల్గొనడం వల్ల అందరి దృష్టి తనపై పడి.. ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఆయన ఇలా గుట్టుగా పాల్గొన్నారని సన్నిహత వర్గాలు తెలిపాయి. నడిగర్‌ సంఘం జరిపిన మౌనప్రదర్శనను యువత తప్పుబట్టారు. తాము జోరుగా చేస్తున్న ఆందోళన నుంచి మీడియా దృష్టిని ఇది మరలుస్తుందని వారు విమర్శించారు.

 ఒక స్టార్ హీరో అనుకోలేదు:

ఒక స్టార్ హీరో అనుకోలేదు:


ఈ నేపథ్యంలో నేరుగా యువత మనోగతానికి అనుగుణంగా వారితో కలిసి విజయ్‌ ఆందోళనలో పాల్గొన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అర్థరాత్రి మేరినా బీచ్‌లో కనిపించిన ఆయన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మొహqనికి కర్చిఫ్ కట్టుకొని బ్లూ షర్ట్ లో అక్కడ ఉన్న యువకుల మధ్యలో చేరిపోయిన విజయ్ ని ఎవరూ ఒక స్టార్ హీరో అనుకోలేదు. విజయ్ కూడా తానో స్టార్ అనుకొనీ వెళ్ళలేదు.

ప్రజల సంస్కృతి కాపాడటం కోసమే:

ప్రజల సంస్కృతి కాపాడటం కోసమే:

'ప్రపంచ వ్యాప్తంగా చట్టాలను తీసుకు వచ్చింది ప్రజల సంస్కృతి కాపాడటం కోసమే. తమిళుడి గుర్తింపు 'జల్లికట్టు'. స్వచ్ఛందంగా 'జల్లికట్టు' జరపాలని ఆందోళన చేయడానికి ముందుకు వచ్చిన యువకులందరికీ నేను తలవంచుతున్నాను. ఈ విషయంలో అరెస్టు చేసిన యువకులను విడుదల చేస్తే నేను సంతోషిస్తాను. దీనికంతటికీ కారణమైన పెటాను ఇక్కడి నుంచి తరిమికొడితే తమిళనాడు సంతోషిస్తుంది" అంటూ ఇదివరకే ఒక వీడియో సందేశం ఇచ్చిన విజయ్. ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా తాను ఎంత నిబద్దతతో ఉన్నాడో తెలియజెప్పాడు.

English summary
On Friday, Vijay skipped the silent protest organised at the Nadigar Sangam grounds in Chennai's T Nagar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu