»   » వారం కాలేదు...అప్పుడే పైరసీ డీవీడీ షో ...ప్రెవేట్ ట్రావెల్స్ బస్సులో

వారం కాలేదు...అప్పుడే పైరసీ డీవీడీ షో ...ప్రెవేట్ ట్రావెల్స్ బస్సులో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పైరసీ అనేది ఇండస్ట్రీకు కొత్తేమి కాదు కానీ రోజు రోజుకీ ఇది పెద్ద సమస్యగా మారుతోంది. చట్టబద్దంగా అనేక చర్యలను నిర్మాతలు, ప్రబుత్వం సలహా,సహాయాలతో తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనపడటం లేదు. ఈ పైరసీ భూతం ఇక్కడే కాదు..తమిళంలోనూ ఉంది కానీ పైరసీ ని కంట్రోలు చేయటంలో అక్కడ ఇండస్ట్రీ కొంతలో కొంత అక్కడ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

అయితే ఈ విషయాన్ని సవాల్ చేస్తున్నట్లుగా ఓ సంఘటన జరిగి మళ్లీ ఎలర్ట్ అయ్యేలా చేసింది. నాలుగు రోజుల క్రితం విడుదల అయిన విజయ్ చిత్రం ధేరీ పైరీసి డీవిడి యధేచ్చగా ఓ ప్రెవేట్ బస్ ట్రావెల్స్ లో వేయటం అందరినీ షాక్ కు గురిచేసింది.

Vijay Theri pirated DVD screening on a private travels bus

విజయ్ డై హార్ట్ ఫ్యాన్ ఒకరు తిరుచ్చు నుంచి తంజావూరు ఓ ప్రెవేట్ ట్రావెల్స్ వారి బస్ లో వెళ్తూంటే ధేరీ పైరసీ ఫ్రింట్ ...ఆ బస్ లో షో వేయటం జరిగింది. అతను వెంటనే తంజావూర్ లోని తన మిగతా విజయ్ అభిమానులందిరనీ పిలిచి, డ్రైవర్ ని, క్లీనర్ ని పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. అసలు ఎక్కడ పైరసీ జరిగిందనే విషయమై పోలీసులు ఇన్విస్టిగేట్ చేస్తున్నారు.

English summary
Recently a die hard fan of vijay has witnessed Theri's pirated DVD screening on a private travels bus which was on its way from Trichy to Tanjavore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu