»   » 'వేడి ' గా విక్రమ్, ఇలియానా రొమాన్స్

'వేడి ' గా విక్రమ్, ఇలియానా రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విక్రమ్, ఇలియానా కాంబినేషన్లో వేడి టైటిల్ తో ఓ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. భూపతి పాండ్యన్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్లాన్ చేసారు. ఈ చిత్రంలో విక్రమ్ ఓ పోలీస్ ఆఫీసర్ గా లీడ్ రోల్ చేయనున్నారు. ఆ పాత్రలో టిపికల్ గా క్రిమినల్స్ తో డీల్ చేయటం హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇక మోహన్ నటరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇలియానా పాత్ర ఓ వర్కింగ్ వుమెన్ చేసే పాత్ర అని చెప్తున్నారు. త్వరలో విడుదల కానున్న రావణ్ ఓ డిపెరెంట్ సినిమా అనీ, ఈ వేడి చిత్రం తన అభిమానులు రెగ్యులర్ గా ఆశించే యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రమని విక్రమ్ చెప్తున్నాడు. ఇక తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు, రవిరాజ ఈ చిత్రంలో విలన్స్ గా చేస్తున్నారు. అలాగే బ్రహ్మానందం, వడివేలు ఇద్దరూ ఈ చిత్రం డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు,తమిళ్ లలో ఒకే సారి రిలీజ్ కానుంది.

ఇక అప్పట్లో ఇలియానా, విక్రమ్ కాంబినేషన్లో ఆ మధ్య '24' అనే చిత్రం ప్రారంభం కానుందంటూ వార్తలు వచ్చాయి. 13బి చిత్రం రూపొందించిన దర్శకుడు విక్రమ్ దీనిని డైరక్ట్ చేస్తారని, మోహన్ నటరాజ్ అనే నిర్మాత ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు. అయితే స్క్రిప్టు సరిగా లేదంటూ విక్రమ్ ఆ చిత్రాన్ని రిజక్ట్ చేసారు. దాంతో అంతా ఆ చిత్రం ఆగిపోయిందనుకున్నారు. కానీ ఆ నిర్మాత మోహన్ నటరాజ్ మాత్రం విక్రమ్ డేట్స్ తన వద్ద ఉండటంతో చిత్రాన్ని కంటిన్యూ చేయదలిచాడు. తాజాగా భూపతి పాండియన్ అనే దర్శకుడు చెప్పిన కథ విని, విక్రమ్ చేత ఓకే చేయించాడు. అదే వేడిగా ప్రారంభం అవుతోంది. విక్రమ్ డేట్స్ వృధా కాకుండా ఈ కథతో సినిమాను సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu