»   » తొలిసారి నయనతార ఆ హీరోతో...ఫుల్ హ్యాపీ

తొలిసారి నయనతార ఆ హీరోతో...ఫుల్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై :నయనతార..గతంలో రజనీకాంత్‌, శరత్‌కుమార్‌, అజిత్‌, సూర్య, ధనుష్‌, శింబు, విశాల్‌ తదితర స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ విక్రమ్‌తో సహా మరికొందరు హీరోల కాంబినేషన్లో నటించడానికి ఆమెకు ఇప్పటివరకు అవకాశాలు రాలేదు. ముఖ్యంగా ఆమె విక్రమ్ సరసన నటించాలని చాలా కాలంగా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. ఆ కాంబినేషన్ ఇన్నాళ్లకు సెట్ అయ్యింది.వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన విక్రమ్‌ సినిమా 'పత్తు ఎండ్రదుకుళ్ల'. ఈ చిత్రం తర్వాత 'అరిమా నంబి' దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో నటించడానికి విక్రమ్‌ అంగీకరించారు. ఈ చిత్రానికి 'మర్మ మనిదన్‌' టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో విక్రమ్‌ సరసన నటించనున్న హీరోయిన్‌ ఎంపికకు కసరత్తులు చేపట్టి మొదట కాజల్‌ అగర్వాల్‌ పేరు పరిశీలించారు.

/tamil/vikram-nayanthara-team-up-for-the-first-time-049227.html

ఇందుకోసం ఆమెతో చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో నయనతారను ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. దీనిని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ కూడా నిర్ధరించారు. దీంతో విక్రమ్‌, నయనతార కాంబినేషన్లో రూపొందే తొలిచిత్రం ఇదే కావడం గమనార్హం.

Vikram, Nayanthara team up for the first time

ఈ చిత్రాన్ని ఎస్‌.కె.టి.స్టూడియోస్‌ ఆధ్వర్యంలో శిబు తమీన్స్‌ నిర్మించనున్నారు. ఆయన ఇప్పటికే విజయ్‌ హీరోగా 'పులి' చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చనుండగా ఈ చిత్రంలో నటి బిందు మాధవి ఓ కీలకమైన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనుండగా డిసెంబరులో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Actors Vikram and Nayantara will be teaming up for the first time in a yet-untitled Tamil project, which will be helmed by Anand Shankar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu