»   » విక్రమ్ నెక్ట్స్ ఆ నాగచైనత్య దర్శకుడు తో....

విక్రమ్ నెక్ట్స్ ఆ నాగచైనత్య దర్శకుడు తో....

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : తమిళ చిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌ జనం ముందుకు రానుంది. . విక్రమ్‌ ఇప్పటివరకు గౌతమ్‌ మీనన్‌తో కలిసి పని చేయలేదు. ఈ నేపథ్యంలో వారిద్దరి కలయికలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గౌతమ్‌ చెప్పిన ఒకలైన్‌ కథ విక్రమ్‌ను బాగా ఆకట్టుకుందని, నటించేందుకు వెంటనే అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని అంటున్నాయి విక్రమ్‌ సన్నిహిత వర్గాలు. తనకు 'దిల్‌', 'ధూల్‌'లాంటి రెండు అద్భుత విజయాలు అందించిన ధరణి దర్శకత్వంలోనూ విక్రమ్‌ నటించనున్నాడు. ప్రస్తుతం 'ఐ' చిత్రంలో తలమునకలై ఉన్నాడు. గౌతమ్ గతంలో నాగచైతన్యతో ... ఏమి మాయ చేసావే చిత్రం రూపొందించి ఉన్నారు.

మాధవన్‌, అబ్బాస్‌ ప్రధాన పాత్రల్లో 'మిన్నలే' తెరకెక్కించి కోలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు గౌతమ్‌ మీనన్‌. అనంతరం సూర్యతో ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో రూపొందించిన 'కాక్క కాక్క' సంచలన విజయం సాధించింది. స్త్టెలిష్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అగ్రనటులంతా ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఉత్సాహం చూపారు. ఈ క్రమంలో 'వేట్టయాడు విలైయాడు'లో కమల్‌హాసన్‌, 'పచ్చైకిళి ముత్తుచరం'లో శరత్‌కుమార్‌, 'వారనం ఆయురం'లో సూర్య, 'విన్నైతాండి వరువాయ'లో శింబు, 'నీదానే ఎన్‌ పొన్‌ వసంతం'లో జీవా నటించారు. అజిత్‌ ఓ చిత్రానికి ఎంపికైనా అది సెట్స్‌పైకి వెళ్లలేదు.

ఇక గౌతమ్ మీనన్ విషయానికి వస్తే...ఆగిపోయిందనుకున్న హీరో సూర్య చిత్రం మళ్లీ మొదలవుతోంది. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు ప్రకటించిన చిత్రం 'ధ్రువనక్షత్రం'. ఆ మధ్య పూజా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. కథలో మార్పులు చోటుచేసుకోవడంతో సూర్య పక్కకు తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. లింగుస్వామి దర్శకత్వంలోని కథకు ఓకే చెప్పినట్లు మరిన్ని వార్తలు వచ్చాయి. మరోవైపు 'సూదుకవ్వుం' దర్శకుడు నలన్‌కుమారస్వామి చెప్పిన అంశం నచ్చడంతో అంగీకారం తెలిపినట్లు సినీవర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రస్తుతం 'ధ్రువనక్షత్రం' కథ సూర్యకు తగ్గట్టు గౌతమ్‌మీనన్‌ మార్చడంతో మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సూర్య పచ్చజెండా ఉపాడని తెలుస్తోంది. 20న అవుట్‌డోర్‌ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు కోడంబాక్కం సమాచారం.

గౌతమ్‌మీనన్‌ మాట్లాడుతూ.. సూర్య 'ధ్రువ్‌' అనే పాత్రలో నటిస్తున్నారు. కథకు నప్పుతుందనే ఉద్దేశంతో చిత్రానికి 'ధ్రువనక్షత్రం' అనే పేరుపెట్టాం. నా గత రెండు చిత్రాల్లో కనిపించిన సూర్యలా కాకుండా కొత్తగా చూడొచ్చని చెప్పారు. పార్తిబన్‌, సిమ్రాన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు. 20 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. 'ధ్రువనక్షత్రం' టైటిల్ తో గతంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం తెలుగులో వచ్చింది. 1989 లో ఆ చిత్రం వచ్చింది. మాఫియా నేపధ్యంలో ఆ చిత్రం రూపొందింది. ఇక ఈ కొత్త చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉండటం, గౌతమ్ మీనన్ చిత్రాలకు సైతం తెలుగులో బిజినెస్ ఉండటం కలిసి వచ్చే అంశం.

English summary
Tamil actor Vikram, busy shooting for director Shankar's "Ai", may join hands for the first time with filmmaker Gautham Vasudev Menon. "Gautham recently narrated a story to Vikram, and the actor loved it. He even expressed his interest to work with him as soon as he completes 'Ai', which is nearing completion," a source from the industry told Media. A source close to Vikram said that Vikram had a discussion with Gautham recently. Vikram has spent more than a year on "Ai", which is 90 percent complete and is slated to release soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu