»   » నిజాయితీ బ్రతికే ఉంది... మిస్సైన, నిశ్చితార్థ ఉంగరం దొరికింది!

నిజాయితీ బ్రతికే ఉంది... మిస్సైన, నిశ్చితార్థ ఉంగరం దొరికింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమార్తె అక్షిత తన ఎంగేజ్ మెంట్ రింగ్ పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ నిశ్చితార్థ ఉంగరాన్ని ఎట్టకేలకు చేజిక్కించుకుంది. దాంతో విక్రమ్ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకీ ఆ రింగ్ ఎలా దొరికిందంటే...

పూర్తి వివరాల్లోకి వెళితే...డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్ తో...కొద్ది కాలం క్రితం అక్షిత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే స్నేహితులతో కలిసి చైన్నైలోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లిన అక్షిత.. చేతి వేలికి ఉంగరం లేకపోవడం గమనించింది.

Vikram's daughter gets lost engagement ring back from cab driver

వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించడం, అనుమానితులను ప్రశ్నించడంలాంటివి చేసినప్పటికీ ఉంగరం జాడ తెలియలేదు.అయితే తాజాగా లక్ష్మణన్ అనే ఓ క్యాబ్ డ్రైవర్.. అక్షిత ఉంగరాన్ని తెచ్చి ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిశ్చితార్థ ఉంగరం పోయిందని వార్తా పత్రికల్లో చదివిన లక్ష్మణన్, తనకు దొరికిన ఉంగరం అదేనని తెలుసుకుని వెంటనే విక్రమ్ ఫ్యామిలీకి అందజేసినట్లు సమాచారం. గాంధీ ఫౌండేషన్ లో లక్ష్మణన్ సభ్యుడిగా ఉన్నాడు. కాగా ఆ ఉంగరం విలువ రూ.12 లక్షల పైమాటేనట.

English summary
Four days after Akshita, actor Chiyaan Vikram’s lost her engagement ring worth several lakhs in an ice-cream parlour on Khader Nawaz Khan Road in Chennai, it was returned to the groom’s family by 36-year-old, Lakshmanan, a cab driver.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X