»   » దర్శకుడుగా మారుతున్న స్టార్ హీరో విక్రమ్

దర్శకుడుగా మారుతున్న స్టార్ హీరో విక్రమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ హీరో విక్రమ్ త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ప్రస్తుతం మణిరత్నం చేస్తున్న రావణ్ చిత్రం రిలీజ్ అనంతరం ఆయన దర్శకుడుగా ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని విక్రమ్ దృవీకరిస్తూ...నేను చేసే ప్రతీ చిత్రాన్ని అబ్జర్వ్ చేయటం ద్వారా దర్శకత్వానికి రోజు రోజుకీ దగ్గరవుతున్నాను. నేను ప్రస్తుతం దర్శకత్వ విభాగంలోని మెళకువలను సెట్స్ పై లైవ్ గా నేర్చుకుంటున్నాను. ఇదంతా ఓ లాంగ్ ప్రాసెస్. నేను ఎప్పుడయితే తృప్తి చెంది దర్శకత్వం వహిస్తాననే నమ్మకానికి వస్తానో ఆ రోజు డైరక్టర్ గా అవతారమెత్తుతాను.ఆ రోజు త్వరలోనే రానుందని నమ్ముతాను అన్నారు. అలాగే సినిమాల్లో నటించటం అనేది నాకు చెస్ ఆడటంలా అనిపిస్తుంది. ప్రతీ సారి కొత్త స్టెప్ తో ముందుకు రావాలనుకుంటాను. అందుకే ఢిఫెరెంట్ గా నా క్యారెక్టర్ ని డిజైన్ చేయమని అడుతూంటాను..ప్రయత్నిస్తూంటాను. అందుకేనేమో నా తోటి వాళ్ళు నాలుగు సినిమాలు పూర్తి చేసేటప్పటికి నేను కేవలం ఒక్క సినిమా మాత్రమే చేయగలుగుతాను అన్నారు. ఇక రావణ్ గురించి మాట్లాడుతూ...ఈ చిత్రంలో నేను తమిళ వెర్షన్ కి హీరోగా, హిందీకి విలన్ గా చేస్తున్నాను. నాకు తెలిసి ఇండియాలో ఏ నటుడు ఇలాంటి ప్రయోగం చేసి ఉండరు. మణిరత్నం ఫెరఫెక్షన్ విషయంలో మాస్టర్...అలాంటి ఆయన సినిమాలో పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu