»   » మంచిచేయటమే రాజకీయం అయితే నేను వస్తున్నా: ప్రకటించిన యంగ్ హీరో

మంచిచేయటమే రాజకీయం అయితే నేను వస్తున్నా: ప్రకటించిన యంగ్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు వాడైనా తమిళ ఇండస్ట్రీలో బాగా రాణించాడు. కోలీవుడ్ లో తన సత్తా చాటిన విశాల్ తెలుగు లో పందెం కోడి చిత్రంతో మంచి విజయం సాధించి తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమాన హీరోగా మారాడు. ప్రస్తుతం నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ గా మరియు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్న విశాల్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రకటించాడు.

దేవీ ట్రస్ట్‌

దేవీ ట్రస్ట్‌

ఇప్పటికే తన అభిమాన సంఘం అయిన దేవీ ట్రస్ట్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. విశాల్‌ హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం తుప్పరివాలన్‌ గురువారం విడుదలయ్యింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా విశాల్ పత్రికలతో భేటీ అయ్యాడు.

ఈ సందర్భంగా విశాల్‌ సేవా కార్యక్రమాలను ప్రస్థావిస్తూ

ఈ సందర్భంగా విశాల్‌ సేవా కార్యక్రమాలను ప్రస్థావిస్తూ

ఈ సందర్భంగా విశాల్‌ సేవా కార్యక్రమాలను ప్రస్థావిస్తూ రాజకీయ రంగ ప్రవేశం ఆలోచనతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ ఈ విషయంలో దాపరికాలు నాకు ఇష్టం లేదు. అధికారం ఉంటే ప్రజలకు మంచి చేయవచ్చు. మంచి చేయడమే రాజకీయం అయితే నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా' అని చెప్పాడు.

తమిళ రైతులకు మద్దతు

తమిళ రైతులకు మద్దతు

చాలా రోజులనుంచీ విశాల్‌ తమిళ రైతులకు మద్దతు ప్రకటించడమే కాకుండా వారి కోసం డిల్లీలో జరిగే ఆందీళనల్లో కూడా పాల్గొన్నాడు. ప్రతి సినిమా టిక్కెట్‌లో ఒకరూపాయి రైతుల క్షేమం కోసం అందేలా చేశాడు . తరచూ తన అభిమానుల సంఘం తరఫున నిరుపేదలకు విద్యాపరమైన సహాయకాలను పంపిణీ చేస్తున్నాడు.

ఒక క్లారిటీ ఇచ్చేసాడు

ఒక క్లారిటీ ఇచ్చేసాడు

ప్రజల కోసం ఇంతగా పనిచేస్తున్న విశాల్ పట్ల రాజకీయ ప్రవేశం కోసమే చేస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో... విశాల్‌ వాటన్నింటికి కలిపి ఒక క్లారిటీ ఇచ్చేసాడు.. అధికారంలో ఉంటే ప్రజలకు అధికంగా మంచి పనులు చేయవచ్చునని, తప్పకుండా తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాడు.

పాఠశాలలు అందుబాటులో లేవు

పాఠశాలలు అందుబాటులో లేవు

రాష్ట్రంలో ఇప్పటికీ విద్యార్థులకు పాఠశాలలు అందుబాటులో లేవని, సుమారు నాలుగు కిలోమీటర్ల వరకూ నడిచి వెళ్లాల్సిన పరిస్థితులే కొనసాగుతున్నాయని, కొత్తగా రాజకీయాల్లోకి ఎవరొచ్చినా వైద్య విద్యను ఉచితంగా అందించాలనీ అభిప్రాయపడ్డాడు విశాల్. సినిమాలు రాజకీయాల చుట్టూ తిరడగం, రాజకీయాలు సినిమా వాళ్ల చుట్టూ తిరగడం పరిపాటే.

పెద్ద చర్చే జరుగుతోంది

పెద్ద చర్చే జరుగుతోంది

అయితే ఈ పరిస్థితి తమిళ చిత్రపరిశ్రమలో కాస్త ఎక్కువ. ఇప్పటికే ప్రముఖ స్టార్‌ హీరోలు రజనీకాంత్‌, కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో విశాల్‌ రాజకీయాల్లో నా ఎంట్రీ షూరూ అంటున్నారు. ఇప్పటికే గట్టి పోటీ మధ్య దక్షిణభారత నటినటుట సంఘం ఎన్నికల్లోనూ, తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ గెలిచి సంచలనం సృష్టించారు విశాల్‌.​

English summary
The latest talk in Tamil state is that Vishal is going to make his grand entry into politics soon. Vishal has this plan of entering politics from a long time but he has not decided yet about the time of his entry into the politics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu