»   » నిర్మాతలను అంత భయపెట్టాడా ఏకంగా నిషేధం పెట్టారు, అసలేం జరిగింది?

నిర్మాతలను అంత భయపెట్టాడా ఏకంగా నిషేధం పెట్టారు, అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఇంటర్వూ ఇస్తే నిషేధం పెడతారా... ఇప్పుడు తమిళ సినీ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్. విశాల్ ఈ ఏడాది ఆగస్టులో ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూ తమిళ నిర్మాతల మండలి(టీఎఫ్ పీసీ) కి షాక్ ఇచ్చింది. దాంతో .. విశాల్ .. ఫిల్మ్ ఫ్యాక్టరీ(వీఎఫ్ఎఫ్) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటిస్తూ విశాల్ షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఈ కుర్రాడు లైట్ తీసుకున్నాడు లెండి.

'నేను ప్రొడక్షన్‌ కౌన్సిల్‌ నుంచి సస్పెండ్‌ అయిన వార్త ఇప్పుడే తెలిసింది. నవ్వుతూ.. హ్యాపీ చిల్డ్రన్స్‌ డే(పెద్దగా నవ్వుతూ). ఇండస్ట్రీ కోసం ఫైట్‌ చేయడాన్ని కొనసాగిద్దాం. గుడ్‌ బై' అని విశాల్‌ ట్వీట్‌ చేశారు.

అసలేం జరిగింది?

ఆగస్ట్ 17వ తేదీన ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ నిర్మాతల మండలి కార్యవర్గ చర్యలపై ఆరోపణలు చేసినట్లు కథనాలు వెలువడి పెద్ద చర్చకే దారి తీశాయి. అంతే కాదు తమిళ నిర్మాత మండలి కార్యవర్గంలోనూ కలవరాన్ని రేకెత్తించాయి. విశాల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నిర్మాతల మండలి ఆయనపై చర్యలకు సిద్ధమైంది.

కాగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో విశాల్ చేసిన ఆరోపణలపై చర్చించిన నిర్మాతల మండలి ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.

Vishal removed from Producers’ Council

ఈ నేపథ్యంలో సోమవారం నిర్మాతల మండలి ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో.. విశాల్ ఆరోపణలు సంఘం నియమ నిబంధనలను, సంఘటితను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని, ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ విశాల్‌కు సెప్టెంబర్ 2న లేఖ పంపినట్టు తెలిపారు. అందుకు ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తినివ్వకపోవడంతో విశాల్‌ను మండలి సభ్యుత్వం నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు వెల్లడించారు.

ఇది తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలానికే దారి తీస్తోంది. నడిగర్ సంఘం కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విశాల్ త్వరలో జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ కార్యదర్శి పదవికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.

English summary
Vishal, actor-producer, who is the general secretary of the Nadigar Sangam, has been removed from the Tamil Film Producers' Council (TFPC), of which he is a member.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu