»   » విశాల్ సినిమాపై నిషేధం..వివాదం

విశాల్ సినిమాపై నిషేధం..వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: 'పాయుం పులి' ప్రదర్శనపై పలు ప్రాంతాల్లో నిషేధం విధించిన నేపథ్యంలో అది వృత్తిధర్మం కాదని తమిళ చలనచిత్ర నిర్మాతల సంఘం తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం విడుదల చేసిన ఓ ప్రకటనలో... 'రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' సంస్థ నిర్మాణంలో రూపొందిన 'లింగా' చిత్రంతో ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు, చెంగల్పట్టు ప్రాంతాల్లో వచ్చిన నష్టాన్ని పూడ్చే వరకు 'వేందర్‌ మూవీస్‌' సంస్థ నిర్మాణంలోని 'పాయుం పులి' చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతించేది లేదని, అందుకే నిషేధిస్తున్నట్లు తమిళనాడు సినిమా థియేటర్ల యజమానుల సంఘం ప్రకటించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇది తీవ్రంగా ఖండించదగ్గదని, దీని గురించి తమిళ చలనచిత్ర నిర్మాతల సంఘానికి ముందస్తుగా తెలియజేయలేదని ఆ ప్రకటనలో ఆరోపించారు. 'లింగా' నష్టానికి 'పాయుం పులి'పై నిషేధం విధించడం తగదని, అది వృత్తిధర్మం కాదని, అందువల్ల, 'పాయుం పులి' ప్రదర్శనపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని డిమాండు చేశారు. లేకుంటే ఈ విషయాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ప్రకటించింది.


Vishal's Paayum Puli may run into trouble

పందెంకోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో విశాల్ మరో చిత్రంతో టాలీవుడ్‌కు దగ్గరవుతున్నాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో ‘పాయుమ్ పులి'గా తమిళంలో రూపొందుతున్న చిత్రం తెలుగులో ‘జయసూర్య'గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సర్వానంద రామ్ క్రియేషన్స్ పతాకంపై వడ్డి రామానుజం సారధ్యంలో జివ్వాజి రామాంజనేయులు తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు.


యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్ సరసన కాజల్ జంటగా నటించింది. విశాల్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, సూరి, హారీష్ ఉత్తమన్, మురళీశర్మ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందించారు.

English summary
Vishal, Kajal's ‘Paayum Puli’ directed by Suseendhran is slated for grand release on Sep, 4th. The film is releasing in Telugu too as ‘Jayasurya’. Now its Tamil release is in trouble as Tamil Nadu Theatre Owners Association has decided to stall the release.
Please Wait while comments are loading...