For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దీపావళి బరి నుంచి తప్పుకుని దారి ఇస్తున్నారు

  By Srikanya
  |

  హైదరాబాద్: ఒక్కోసారి అదృష్టం అలా చెప్పా పెట్టకుండా కలిసి వస్తూంటుంది అంటున్నారు చెన్నై సినీ వర్గాలు. ఎవరి అదృష్టం గురించి అంటారా వారి టాపిక్..ఇంకెవరు తెలుగు,తమిళ భాషల హీరో విశాల్ గురించి. వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న విశాల్ తన తాజా చిత్రం పూజై విడుదల కోసం సిద్దం చేస్తున్నాడు. అయితే అదే దీపావళిక మరో రెండు పెద్ద చిత్రాలు ప్రక్కనే పొంచి ఉండటంతో కాస్త కంగారుగానే ఉన్నాడు. అయితే తాజా సమాచారాన్ని బట్టి అవి సీన్ లోంచి తప్పుకున్నాడు. దాంతో విశాల్ ఊపిరి పీల్చుకున్నాడు.

  వివరాల్లోకి వెళ్తే... దీపావళి కానుకగా వెండితెరపై అగ్రహీరోలు తమ చిత్రాలతో అలరిస్తారని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. శంకర్‌ దర్శకత్వంలోని 'ఐ', విజయ్‌ హీరోగా నటించిన 'కత్తి', విశాల్‌ 'పూజై', బాలచంద్రన్‌ కథ నేపథ్యంలో 'పులిపార్వై' వంటి పలు సినిమాలు విడుదలకు ముస్తాబయ్యాయి. దీంతో సగటు ప్రేక్షకుడు రెండునెలల క్రితం దీపావళిని తలచుకుని మురిసిపోయాడు. తీరా ఆ సమయం వచ్చేసరికి ఒకట్రెండే బరిలో ఉండటంతో కాస్త నిరాశ పడుతున్నాడు.

  స్లైడ్ షోలో... మిగతా విశేషాలు...

  విక్రమ్ ...ఐ

  విక్రమ్ ...ఐ

  ఇతర హీరోల పరిస్థితి ఏమోకానీ.. 'అపరిచితుడు' తర్వాత సరైన హిట్‌ లేక విలవిలలాడిపోతున్నారు విక్రం. 'తాండవం' తర్వాత ఏకంగా రెండున్నరేళ్లపాటు శంకర్‌ దర్శకత్వంలోని 'ఐ'లో నటించారు. అన్ని పనులూ పూర్తయినా.. ఇంకా విడుదలకు నోచుకోకపోవడంతో విక్రం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ దీపావళికి తన పేరు మోతమోగుతుందని భావించారు. కానీ ఆ సినిమా పండుగ బరిలో నుంచి తప్పుకుంది. డిసెంబరులోగానీ.. సంక్రాంతికిగానీ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

  కత్తి

  కత్తి

  గత ఏడాది మాదిరిగానే 'తుపాకి' వంటి హిట్‌ను సొంతం చేసుకోవాలని భావించిన ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌లు.. ఈ సారి 'కత్తి'తో సిద్ధమయ్యారు. ఈ సినిమాకు చిత్రీకరణ దశ నుంచి ఇప్పటి వరకు సమస్యలు ఎదరవుతూనే ఉన్నాయి. 'కత్తి' సినిమా విడుదలను అడ్డుకుంటామని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇంకా పలు తమిల సంఘాలు కూడా గుర్రుగా ఉన్నాయి. ఓ తమిళ చిత్రాన్ని శ్రీలంకకు చెందిన వ్యక్తి.. అందులోనూ రాజపక్స బంధువు నిర్మించడమేంటని నిలదీస్తున్నారు. మరి ఈ పరిస్థితులను దాటుకుని దీపావళికి చిత్రం వస్తుందో?.. రాదో?.. కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

   మరో విజయం కోసం

  మరో విజయం కోసం

  వరుస పరాజయాలతో సతమతమైన విశాల్‌కు 'పాండియనాడు' మంచి బ్రేక్‌నిచ్చింది. తాజాగా వచ్చిన 'నాన్‌ సిగప్పు మనిదన్‌' కూడా హిట్టయింది. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్‌ కొట్టేందుకు 'పూజై'తో సిద్ధమవుతున్నారు విశాల్‌. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. హరి దర్శకత్వం వహించగా... శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ చిత్రం ప్రేక్షకులకు దీపావళి ధమాకాను ఏ రేంజ్‌లో అందిస్తుందో వేచిచూడాలి.

  మరోవైపు

  మరోవైపు

  ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌ కుమారుడు చిన్నారి బాలచంద్రన్‌ జీవితకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'పులిపార్వై' కూడా దీపావళికే విడుదల కానుండటం విశేషం.

  తెలుగులోనూ...

  తెలుగులోనూ...

  తెలుగులోనూ విశాల్ నటించిన పూజ చిత్రం విడుదల అవుతోంది. మిగతా చిత్రాలు కూడా డబ్ చేసారు విడుదల కోసం...అయితే అవన్నీ ప్రక్కకు తప్పుకోవటం ఇక్కడ కూడా కలిసి వచ్చే అంశం.

  English summary
  Pooja is an upcoming Tamil action-masala film directed by Hari and produced by Vishal. The film features Vishal and Shruti Haasan in the leading roles, while Sathyaraj, Raadhika Sarathkumar and Mukesh Tiwari play other pivotal roles in an ensemble cast. The film is scheduled for an October 2014 release on the occasion of Deepavali.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X