»   »  బద్దశత్రువులైన ఆ ఇద్దరు హీరోలు కలిశారు, అంతా షాక్... కీలక విషయాలపై చర్చ!

బద్దశత్రువులైన ఆ ఇద్దరు హీరోలు కలిశారు, అంతా షాక్... కీలక విషయాలపై చర్చ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
shimbu & Vishal Recombines For Tamil industry Uplift

తమిళ హీరోలు విశాల్, శింబు మధ్య చాలా కాలంగా విబేధాలు ఉన్నాయి. తమిళ ఫిల్మ్ చాంబర్ ఎన్నికల సమయంలో ఇవి మరింత ముదిరాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇద్దరు హీరోలు బద్దశత్రువుల్లా ఉంటారని తమిళనాడులో టాక్. చాలా కాలంగా తమిళ నటీనటు సంఘం, నిర్మాతల కౌన్సిల్‌లో విశాల్ వర్గం ఆధిపత్యం కొనసాగుతోంది. తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంటుగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా విశాల్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ మీటింగ్ జరిగినా శింబు హాజరయ్యేవాడు కాదు.

ఆశ్చర్యంలో ముంచెత్తిన శింబు

ఆశ్చర్యంలో ముంచెత్తిన శింబు

అయితే మార్చి 21న జరిగిన తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, థియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ సమావేశానికి శింబు హాజరవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మీటింగులో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. విశాల్‌తో ఉన్న విబేధాలను పక్కన పెట్టి శింబు ఈ మీటింగుకు హాజరవ్వడంతో పాటు ఇండస్ట్రీ బాగు కోసం పలు విలువైన సలహాలు కూడా ఇచ్చారు.

 రెమ్యూనరేషన్ విషయంలో

రెమ్యూనరేషన్ విషయంలో

ఈ సమావేశంలో కొందరు యాక్టర్లు భారీగా రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారనే విషయం చర్చకు రాగా... దీనిపై శింబు స్పందిస్తూ ఎగ్జిబిటర్లు అందరూ టికెట్లను కంప్యూటరైజ్ చేయాలని, అపుడు బాక్సాఫీసు కలెక్షన్ల విషయంలో పారదర్శకత ఏర్పడుతుందని, దాని ఆధారంగా యాక్టర్ల రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి వీలుంటుందని తెలిపారు.

 శింబుకు థాంక్స్ చెప్పిన విశాల్

శింబుకు థాంక్స్ చెప్పిన విశాల్

సమావేశం ముగిసిన అనంతరం విశాల్ మాట్లాడుతూ... శింబుకు విశాల్ థాంక్స్ చెప్పారు. శింబు చెప్పిన సలహాలు పరిగణలోకి తీసుకుని పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు. శింబు ఈ సమావేశానికి రావడంపై అందరూ సంతోషం వ్యక్తం చేశారని, ఎంతో ఎంతో విలువైన సలహాలు ఇచ్చారని, టికెట్స్ విధానాన్ని కంప్యూటరైజ్డ్ చేయడం ద్వారా యాక్టర్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే నిర్మాతల సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

శింబు, విశాల్ మధ్య ఇపుడు అంతా ఓకే

శింబు, విశాల్ మధ్య ఇపుడు అంతా ఓకే

గతంలో విశాల్, శింబు మధ్య జరిగిన వివాదాలు పరిశీలిస్తే.... నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో విశాల్ మీద శింబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే సమయంలో శింబు ‘బీప్ సాంగ్' వివాదంలో ఇరుక్కున్నపుడు విశాల్ మద్దతు ఇవ్వలేదు. దీంతో పాటు ఇద్దరి మధ్య చాలా గొడవలు ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరూ కలవడం బట్టి చూస్తే ఇద్దరూ పాత గొడవలు అన్ని పక్కన పెట్టి పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు భావిస్తున్నారు.

English summary
Simbu surprised many Wednesday, March 21, when he took part in a meeting attended by the Tamil Nadu Producers' Council (TNPC), theatres owners and exhibitors. After the meeting, a visibly happy Vishal thanked Simbu for his participation and promised to consider all his suggestions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X