»   » శివకార్తికేయన్, నయనతార ‘వేలైక్కారన్’ మోషన్ పోస్టర్ అదుర్స్

శివకార్తికేయన్, నయనతార ‘వేలైక్కారన్’ మోషన్ పోస్టర్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ స్టార్ శివకార్తికేయన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'వేలైక్కారన్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ద్వారా సినిమాలోని మెయిన్ క్యారెక్టర్లను పరిచయం చేశారు.

శివకార్తికేయన్, నయనతార, పహాద్ ఫాజిల్, స్నేహ, ప్రకాష్ రాజ్, ఆర్.జె బాలాజీ, సతీష్, వినోదిని వైద్యనాథన్, రోబో శంకర్, చార్లీ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మోషన్ పోస్టర్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆహారం కల్తీపై ఇద్దరు యంగస్టర్లు చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న తమిళంలో విడుదల చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

శివకార్తికేయన్ నటించిన చివరి చిత్రం 'రెమో' తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. 'వేలైక్కారన్' కూడా తెలుగులో విడుదల చేసే అవకాశం ఉంది.

English summary
Sivakarthikeyan’s motion poster release. The poster introduces the main characters of the movie played by Sivakarthikeyan, Nayanthara, Fahadh Faasil, Sneha, Prakash Raj, RJ Balaji, Sathish, Vinodhini Vaidyanathan, Robo Shankar and Charle among others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu