»   » నయనతార ఈ కొత్త మేనేజర్ ట్విస్ట్ ఏమిటి?

నయనతార ఈ కొత్త మేనేజర్ ట్విస్ట్ ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ మధ్యన నయనతార తనకు ఎంతో కాలంతో పనిచేస్తున్న అజిత్ అనే మేనేజర్ మానేసాడు. ఎందుకంటే ఆమె బిహేవియర్ నచ్చటం లేదని, ఇచ్చిన మాట మీద నిలబడకపోవటంతో తాను బయిట ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని చెప్పాడు. ఆ తర్వాత నయాతార డేట్స్ అన్నీ కూడా ప్రభుదేవానే చూస్తున్నాడు. అందులోనూ కొత్త ఆఫర్స్ ని కూడా ఆమె ఏమీ ఒప్పుకోవటం లేదు.అంతేగాక నయనతార కొద్ది రోజుల క్రితం తాను పెళ్ళి చేసుకోబోతున్నానని, ఏ కొత్త ఆఫర్స్ ఒప్పుకోవటం లేదని చెప్పింది. అయితే రీసెంట్ గా ఆమె మరో మేనేజర్ ని పనిలో పెట్టుకుంది. దాంతో ప్రభుదేవాని పెళ్ళి చేసుకుంటుందనే అందుకునే ఆపర్స్ ని వదులుకుంటోందని అనుకున్నవారంతా ఒక్కసారి షాక్ అయ్యారు. దీంతో అంతా ఆమె మళ్లీ మనసు మార్చుకుందా? నటనను తిరిగి కొనసాగించనుందా ..లేకుంటే కొత్త మేనేజరును ఎందుకు నియమించుకుంది అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన శ్రీరామరాజ్యం అనే ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది.

English summary
Ajit, who has been working as actress Nayantara’s Manager for the past few years, has decided to call it quits and has dissociated himself from managing the affairs of the actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu