»   » లంగా, జాకెట్టూ, రిక్షా... రకుల్ ప్రీత్ సింగ్ ఇరగదీసింది

లంగా, జాకెట్టూ, రిక్షా... రకుల్ ప్రీత్ సింగ్ ఇరగదీసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా నిర్మాణం లో ఎంత మార్పు వచ్చిందీ నటీనటుల డేడికేషన్ కూడా అంతే స్థాయిలో పెరిగింది ఒక్క సినిమాలో పాత్ర అంటే ఊరికే చేసేద్దాం అనుకోవటం లేదు. అది గుర్రపు స్వారీ కావచ్చు, కత్తి యుద్దం కావచ్చు, ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి దూకే రిస్కీ స్టంట్ కావచ్చు స్వయంగా చేస్తేనే గానీ సంతృప్తి గా ఫీలవటం లేదు. అదే పద్దతిని రకుల్ ప్రీత్ కూడా ఫాలో అయిపోతోంది కొత్త సినిమా కోసం మరీ కత్తి యుద్దాలూ గట్రా చేయలేదు గానీ ఓ చెప్పుకోదగ్గ పనే చేసింది మరి.....

తీరాన్ అధిగరాం ఓండ్రు

తీరాన్ అధిగరాం ఓండ్రు

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తమిళ్ తెలుగు సినిమాలతో బిజీ గా ఉంది. కార్తీ హీరోగా వస్తున్న ‘తీరాన్ అధిగరాం ఓండ్రు' అనే సినిమాలో రకుల్ హీరోయిన్. ఈ సినిమాలో ఒక పాట కోసం రకుల్ రిక్షా తొక్కి అందరిని ఆశ్చర్య పరిచింది. అసలు ముందు డాన్స్ అసిస్టెంట్ రిక్షా తొక్కి చూశాడట.

Jaya Janaki Nayaka Teaser Review | Bellamkonda Sreenivas, Boyapati Sreenu
వెంటనే సరే అనేసింది

వెంటనే సరే అనేసింది

తొక్కడం చాల కష్టంగా ఉంది అనిపించి ఆపేశాడు. మరి నాకే కుదర్లేదు ఈ హీరోయిన్ చేస్తుందో లేదో అని ఆలోచనలో పడ్డాడట. ఎందుకైనా మంచిది ఒకసారి రకుల్ అభిప్రాయం తెలుసుకొందాం అని సంకోచిస్తూ అడగ్గా.. దానికి రకుల్ ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే సరే అనేసిందట.

ఎక్కి తొక్కేసింది

ఎక్కి తొక్కేసింది

అలా అనడమే కాకుండా రిక్షాను చక్కగా ఎక్కి తొక్కేసింది రకుల్. దానికి ముందు కొద్దిసేపు ట్రైనింగ్ తీసుకుందట లెండి. ఎంత సైకిల్ తొక్కిన అనుభవం ఉన్న రిక్షా సంగతి వేరు. అనుకున్నంత ఈజీ కాదు రిక్షా తొక్కటం అయినా పర్లేదు బాగానే నేర్చుకుందట. నేర్చుకోవటమేమిటి సీన్లో ఇరగదీసేసింది.

భలే ఉంది లెండి

భలే ఉంది లెండి

"నేను భయపడలేదు కానీ రిక్షా ఆయన మాత్రం భయపడ్డాడు నేను ఎక్కడ రిక్షాను పాడు చేస్తానో అని. అతను బ్రేక్ ఎక్కడ ఉంటుంది ఎలా బ్రేక్ వేయాలి అని నాకు చాల విపులంగా చెప్పాడు. భలే ఉంది లెండి రిక్షాను తొక్కుతుంటే'' అని తన అనుభవాన్ని చెప్పింది. హీరో కార్తీని రిక్షా వాలాను వెనకాల కూర్చొబెట్టుకొని రిక్షా తొక్కుతుంటే మంచి కిక్ ఇచ్చింది అని చెబుతోంది రకుల్. రకుల్ కి కిక్కే వచ్చి ఉంటుంది గానీ రిక్షాలో కూచున్న కార్తీ ఎంత భయపడ్డాడో ఎవ్వరికీ చెప్పడు కదా

English summary
For Rakul Preet, riding a cycle rickshaw for the first time for her upcoming film 'Theeran Adhigaram Ondru' "was a fun affair."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu