»   » అతనితో నయనతార ఎందుకు నటించనంటోంది?

అతనితో నయనతార ఎందుకు నటించనంటోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ నయనతార. సౌత్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరు. ఏళ్ల తరబడి హీరోయిన్ గా హవా కొనసాగిస్తున్న ఘనత ఆమెది. స్టార్ హీరోలతో పాటు కొత్తగా ఎంట్రీ ఇస్తున్న కుర్ర హీరోలతోనూ ఆమె సినిమాలు చేస్తోంది. ఎవరితో ఎలాంటి సినిమాలు చేసినా ఆమెకు ఉన్న క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తరగడం లేదు.

నయనతార తన పాత్రలకు ఉండే ప్రాధాన్యత పరంగానే సినిమాలకు సైన్ చేస్తుంది. పాత్ర నచ్చితే ఎవరి సరసన నటించడానికైనా ఆమె సిద్ధంగానే ఉంటుంది. అయితే నటుడు విక్రమ్ తో నటించడానికి మాత్రం ససేమిరా అంటోందట నయనతార. విక్రమ్ లాంటి స్టార్ హీరో సరసన నటించడానికి ఆమె ఎందుకు ఒప్పుకోవడం లేదనే విషయం ఇపుడు హాట్ టాపిక్ అయింది.

Why Nayanthara said no to Vikram?

గతంలో నయనతారకు విక్రమ్‌తో నటించే అవకాశం వచ్చింది. అదే సమయంలో ఎస్‌జే.సూర్యకు జంటగా కళ్వనిన్‌కాదలి చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ముందుగా కమిట్ అయిన ఎస్‌జే.సూర్య చిత్రాన్ని కాదనడం ఇష్టం లేక ఆ చిత్రంతో పాటు విక్రమ్ చిత్రానికి కాల్‌షీట్స్ సర్ధుబాటు చేస్తానని చెప్పారట.

అయితే విక్రమ్ చిత్ర యూనిట్ అలా కుదురదు మీరు విక్రమ్ చిత్రం మాత్రమే చెయ్యాలని డిమాండ్ చేసారట. ఆమె మనసు నొప్పించే విధంగా ప్రవర్తించారట. దీంతో చిర్రెత్తిన నయనతార ఎప్పటికీ విక్రమ్ చేయనని తెగేసి చెప్పిందట. చాలా కాలం తర్వాత అరిమానంబి చిత్రం ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నయనను హీరోయిన్‌గా ఎంపిక చేసే ప్రయత్నాలు జరిగాయి. తన మాటంటే మాటే విక్రమ్ తో నటించేది లేదని తెగేసి చెప్పిందట.

English summary
Vikram’s film with Anand Shankar will commence from this week. Before Kajal Aggarwal, the film’s director actually approached Nayanthara to play the female lead in the film but before even hearing the story, the actress refused to sign the project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu