twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేసుదాసుకు 'జీవిత సాఫల్య పురస్కారం'

    By Srikanya
    |

    చెన్నై : గత కొన్ని దశాబ్దాలుగా కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవలు చేస్తున్న విశ్వవిఖ్యాత సంగీత విద్వాంసుడు పద్మభూషణ్‌ జేసుదాసును జీవిత సాఫల్య పురస్కారం వరించింది. చెన్నై కల్చరల్‌ అకాడమీ ఈ ఏటి సంగీతోత్సవాల ప్రారంభ సమావేశం శుక్రవారం జరిగింది. టీనగర్‌లోని రామారావు కళామంటపం వేదికైంది. అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ నల్లి కుప్పుస్వామిచెట్టి అతిథి, పురస్కార గ్రహీతలను పరిచయం చేశారు.

    ఆయా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న జేసుదాసు (కర్ణాటక సంగీతం), మదురై మురళీధరన్‌ (భరతనాట్యం), కోవై పద్మనాభన్‌ (నాటక రంగం)లకు పురస్కారాలు ప్రదానం చేశారు. జేసుదాసును జీవిత సాఫల్య పురస్కారంతో, మురళీధరన్‌, పద్మనాభన్‌లను 'కళాశిరోమణి' పురస్కారాలతో సత్కరించారు. పురస్కారం పేరిట పట్టుశాలువా, బంగారు పతకం, బిరుదుపత్రం, నగదు బహుకరించారు.

    Yesudas get lifetime achievement award

    పురస్కార గ్రహీత జేసుదాసు తమ స్పందనలో.. కర్ణాటక సంగీతం ఓ అఖాతంలాంటిదన్నారు. నేటికీ తాను విద్యార్థినేనన్నారు. తమకు లభించిన సంగీత భాగ్యం దేవుని వరప్రసాదమన్నారు. కష్టపడితేనే ఫలితం లభిస్తుందని సోదాహరణంగా తెలిపారు. త్యాగరాజు కనకాంగి రాగంలో విరచిత 'శ్రీగణనాథం' కృతిని ఎంతో శ్రమించి నేర్చానని, గానం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నేటి యువతరం గురు సమక్షంలో అంకితభావంతో విద్యనేర్వాలని, అన్నింటినీ మించి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మురళీధరన్‌ తమకు లభించిన పురస్కారం కన్నవారికి, గురువు చాముండేశ్వరికి చెందుతుందన్నారు.

    సంగీతోత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన టీసీఎస్‌ అధ్యక్షుడు రవి విశ్వనాథ్‌ అవార్డు గ్రహీతలను అభినందించారు. నగరంలో జరుగుతున్న సంగీతోత్సవాల వివరాలను తమ సంస్థ రూపొందించిన 'టీసీఎస్‌ సరిగమ' ద్వారా మొబైల్‌ఫోన్‌లో పొందవచ్చని తెలిపారు. ఉపాధ్యక్షుడు, చెన్నై దూరదర్శన్‌ మాజీ డైరెక్టరు ఎ.నటరాజన్‌ స్వాగతం పలుకుతూ.. జనవరి 7దాకా 27 రోజుల పాటు తాము నిర్వహిస్తున్న సంగీతోత్సవాల్లో మొత్తం 500 మంది కళాకారులకు అవకాశం కల్పించామన్నారు.

    కోవై పద్మనాభన్‌ సహ కళాకారులందరికీ తమ పురస్కారం అర్పిస్తున్నానన్నారు. వర్థమాన గాయని సేలం గాయత్రి 'నిగమ వేదవేద్యం భజేహం' అంటూ ఆలపించిన గణనాథుని ప్రార్థనతో మొదలైన కార్యక్రమం కార్యదర్శి ఎన్‌.బాలచందర్‌ వందన సమర్పణతో ముగిసింది. నగరంలోని సోదర సంగీతసభల నిర్వాహకులనేకులు విచ్చేశారు. ముందుగా ఏర్పాటైన ఏవీ పకీరుసామి బృందం నాదస్వర కచేరి అలరించింది.

    English summary
    Renowned playback singer KJ Yesudas has been selected for the lifetime achievement award .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X