Just In
Don't Miss!
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Automobiles
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss Telugu 4s 13th Week Nomination leak: ఈ వారం ఐదుగురు నామినేట్.. అందులో రెండు జంటలు!
బుల్లితెర చరిత్రలోనే బ్రహ్మాండమైన రీతిలో ప్రేక్షకుల స్పందనను దక్కించుకుని తిరుగులేని షోగా పేరొందింది బిగ్ బాస్. మిగిలిన భాషల కంటే ఎక్కువ రెస్పాన్స్‌తో దూసుకుపోతోన్న ఈ తెలుగు రియాలిటీ షో... మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ సైతం అదే రీతిలో దూసుకుపోతోంది. ఇది తుది అంకానికి చేరుకోవడంతో షోపై మరింత ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఎవరు టాప్ -5లో ఉంటారన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ లిస్ట్ లీకైంది. వివరాల్లోకి వెళ్తే....

గ్రాండ్ ఓపెనింగ్.. అదే రీతిలో ప్రసారం
గత వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో నాలుగో సీజన్‌ను ప్రసారం చేయాలని బిగ్ బాస్ నిర్వహకులు పట్టుదలగా పని చేశారు. అందుకు అనుగుణంగానే ప్రీమియర్ ఎపిసోడ్‌తోనే ఇండియన్ టెలివిజన్ రికార్డులను బద్దలు కొట్టిందీ షో. ఏకంగా 18 పైచిలుకు రేటింగ్‌తో సత్తా చాటింది. ఆ తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందను అందుకుంటూ దూసుకుపోతూనే ఉంది.

సోమవారం మరింత రంజుగా మారింది
బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ ఎంతో ప్రధానమైనది. దాని ఆధారంగానే షో నడుస్తుంది. కాబట్టి కంటెస్టెంట్లను ఎలిమినేషన్ జోన్‌లోకి తీసుకొచ్చే నామినేషన్ టాస్క్ ఇంకా ముఖ్యమైనది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ టాస్క్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి నామినేషన్స్ టాస్క్ పెట్టినప్పుడల్లా ఏదో ఒక గొడవ జరగడంతో రంజుగా మారుతోంది.

అందరి చూపు ఈరోజు మీదే ఉంటుంది
బిగ్ బాస్ నాలుగో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ ఎపిసోడ్‌కు ఎంపికయ్యే ఐదుగురు ఇంటి సభ్యులు ఎవరన్న దానిపై అంతటా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 13వ వారం జరిగే నామినేషన్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఈ సారి ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఒకరు తప్పకుండా బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది.

సరికొత్తగా ఈ వారం నామినేషన్ టాస్క్
ఈ వారానికి సంబంధించి సోమవారం జరిగే నామినేషన్ టాస్కును సరికొత్తగా రూపొందించారు బిగ్ బాస్ నిర్వహకులు. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. ప్రతి ఇంటి సభ్యుడు కలర్ నింపిన ట్యూబ్‌లను మెడలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కంటెసెంట్ నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు సభ్యుల కంటైనర్లలో పోయాలి. ఎవరి కంటైనర్‌లో ఎక్కువ కలర్ వాటర్ ఉంటే వాళ్లు నామినేట్ అయినట్లు.

నామినేషన్ జాబితా ముందే బయటకు
అత్యంత ముఖ్యమైన స్టేజ్‌కు చేరుకుంది బిగ్ బాస్ షో. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వారం ఎంతో ముఖ్యమైనదే. ఏడుగురు సభ్యులు మిగలగా.. అందులో రాబోయే రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారు. మిగిలిన ఐదుగురు మాత్రమే ఫైనల్‌కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ వివరాలు ఎప్పటి లాగే ముందే లీక్ అయ్యాయి.

నామినేట్ అయిన వారిలో రెండు జంటలు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ వారం ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో జబర్ధస్త్ అవినాష్, అభిజీత్, అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్, దేత్తడి హారిక ఉన్నారు. కెప్టెన్ లేకపోవడంతో ఈ సారి అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. అయినప్పటికీ మరో ఇద్దరు సభ్యులు సోహెల్ రియాన్, ఆరియానా గ్లోరీ ఈ సారి నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.